హీరో, హీరోయిన్.. భార్యాభర్తలయ్యారు!

బాలీవుడ్ సినీ ప్రియుల్లో అత్యంత ఆసక్తిని రేపిన దీపికా, రణ్ వీర్ సింగ్ ల పెళ్లి కార్యక్రమం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇటీలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ను  చేసుకుంది ఈ జంట. దీపికకు సంబంధించిన కొంకణి సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. పరిమితమైన అతిథుల మధ్యన ఈ జంట ఒక్కటయ్యిందని సమాచారం.

వీరి సన్నిహిత బంధువులు, బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. దీప్ వీర్ ల పెళ్లిగా ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో ట్రెండీగా నిలిచింది. విరాట్ కొహ్లీ, అనుష్కా శర్మల వివాహం తర్వాత ఆ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచింది ఈ పెళ్లి.

దీపిక, రణ్ వీర్ లు చాలా కాలం నుంచినే ప్రేమలో ఉన్నారు. రెండూమూడేళ్లుగా వీళ్ల ప్రేమాయణంపై రకరకాల వార్తలు వచ్చాయి. తమ ప్రేమ, పెళ్లి ఊహాగానాలను ఈ జంట ఖండించనూ లేదు, అలాని సమర్థించనూ లేదు.

లోకల్ గా హడావుడి లేకుండా డెస్టినేషన్ వెడ్డింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక దీపిక మూలాలు బెంగళూరులోనే ఉన్నాయి కాబట్టి.. అక్కడే వీరి రిసెప్షన్ ముందుగా జరగబోతోంది. ఆ తర్వాత ముంబైలో మరో రిసెప్షన్ ను నిర్వహించబోతున్నారు.

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments