సైరాపై మరింత క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

ట్రయిలర్ లాంచ్ సందర్భంగా సైరా సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చాడు నిర్మాత రామ్ చరణ్. మరీ ముఖ్యంగా సినిమాలో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందా ఉండదా అనే అంశంపై స్పష్టత ఇచ్చాడు. టీజర్ లో పవన్ వాయిస్ ఓవర్ ను వాడుకున్నారు. ఆ వాయిస్ ఓవర్ కు కొనసాగింపుగా సినిమాలో కూడా పవన్ వాయిస్ ఉంటుందని స్పష్టంచేశాడు చరణ్. సినిమా స్టార్టింగ్, ఎండింగ్ లో పవన్ వాయిస్ ఓవర్ ఉండబోతోంది.

సైరా సినిమా క్లైయిమాక్స్ లో నరసింహారెడ్డి పాత్ర చనిపోయింది. దీనివలన సినిమాపై నెగెటివ్ ప్రభావం పడుతుందనే అనుమానం చాలామందిలో ఉంది. ఎందుకంటే దుఃఖాంతమైన సినిమాలేవీ తెలుగులో పెద్దగా ఆడలేదు. ఈ బ్యాడ్ సెంటిమెంట్ పై కూడా యూనిట్ స్పందించింది. శాడ్ ఎండింగ్ వల్ల తమకు భయంలేదని, నరసింహారెడ్డి చేసిన ప్రాణ త్యాగంతోనే స్వతంత్ర ఉద్యమం మొదలౌతుందని తెలిపింది. అది ట్రాజడీ ఎండ్ గా కాకుండా.. విక్టరీగా సినిమాలో కనిపిస్తుందని తెలిపింది.

ఇక నరసింహారెడ్డి జీవితంలో కమర్షియల్ అంశాలపై స్పందిస్తూ.. నరసింహారెడ్డిని ఉరితీసిన తర్వాత కోట గుమ్మానికి 30 ఏళ్ల పాటు అతడి తలను వేలాడదీశారని, సినిమా తీయడానికి ఇంతకంటే పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఇంకేంకావాలని ప్రశ్నించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. మరోవైపు సినిమాలో రామ్ చరణ్ కు ఎందుకు పాత్ర ఇవ్వలేదనే అంశంపై స్పందిస్తూ.. నిర్మాత అనే అతిపెద్ద పాత్రను చరణ్ పోషించాడని, అంతకంటే పెద్ద పాత్ర తన సినిమాలో లేదన్నాడు. 

సైరా ట్రయిలర్ లాంచ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments