చిరంజీవి ఆ ఇబ్బందిని చరణ్ ద్వారా తప్పించుకుంటారా!

రొమాంటిక్ సీన్లలో ఇప్పుడు చిరంజీవి నటించడం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది అనేది ఆయన అభిమానుల్లో కూడా కొందరు చెబుతున్నమాట. విమర్శకుల సంగతి చెప్పనక్కర్లేదు. 'స్టాలిన్' సినిమాలో చిరంజీవి, త్రిష జంట మీదే చాలా కామెంట్లు వచ్చాయి. వాళ్లిద్దరూ సెట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆ తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్' కోసం ఏకంగా పెళ్లి అయిన మోడల్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇటీవలి 'సైరా నరసింహారెడ్డి'లో హీరోయిన్లు చిరంజీవి పక్కన అమరారు. కానీ, తమన్నాపై చిరంజీవి వలపుబాణాలు సంధించడం మాత్రం అంత ఆకట్టుకోలేదు. చిరంజీవి అలాంటి సీన్లు చేయకపోతేనే బావుంటుందనే అభిప్రాయాలు వినిపించాయి.

అయితే చిరంజీవి సినిమాలు అంటే మాస్ మసాలాలు కావాల్సిందే. అందులో డ్యాన్సులు, పాటలు లేకపోతే అంతే సంగతులు. 'సైరా నరసింహారెడ్డి' అంటే ఆ కాన్సెప్ట్ కు తగ్గట్టుగా నడిచిపోయింది. అయితే తదుపరి సినిమాలకు రొమాన్స్, సాంగ్స్ లేకపోతే ఇబ్బందే. అయితే చిరంజీవి చేస్తే అంత బాగోదు. అందుకే ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారట.

రామ్ చరణ్ తేజను యంగ్ చిరంజీవిగా చూపించే ఏర్పాట్లు అవి. పాటలు, రొమాన్స్, డ్యాన్సుల కోసం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ ను చూపించి తదుపరి సినిమాలో బండి లాగించేస్తారని సమాచారం. అయితే అన్ని సినిమాలకు ఇది సెట్ అయ్యే ఫార్ములా కాదు. ఒక సినిమా వరకూ ఇది ప్రత్యామ్నాయ మార్గమే!

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ

Show comments