రామ్‌ చరణ్‌దే ఆధిపత్యం

సంక్రాంతికి మూడు భారీ సినిమాలొస్తున్నాయి. బాలకృష్ణ నటిస్తోన్న 'ఎన్టీఆర్‌' బయోపిక్‌పై ఆసక్తి బాగానే వుంది. అలాగే వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన 'ఎఫ్‌2' కూడా మంచి కామెడీ అనే ఫీలింగ్‌ తెచ్చింది. 'వినయ విధేయ రామ' మాత్రం రెగ్యులర్‌ బోయపాటి మార్కు మసాలా చిత్రంలా అనిపిస్తోంది. అయితే ఈ మూడింట్లోను 'వినయ విధేయ రామ'కే మార్కెట్‌ వర్గాలనుంచి ఎక్కువ సపోర్ట్‌ లభిస్తోంది.

సంక్రాంతికి మాస్‌ మసాలాలు బాగా సేల్‌ అవుతాయనేది హిస్టరీ. కనుక రొటీన్‌గా కనిపిస్తున్నా కానీ రామ్‌ చరణ్‌ సినిమాకే ఎక్కువ ఓట్లు, థియేటర్లు పడుతున్నాయి. ఈ మూడు సినిమాల్లోను రామ్‌ చరణ్‌ చిత్రాన్ని ప్రదర్శించడానికే ఎగ్జిబిటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ చిత్రానికి వస్తోన్న ఫిక్స్‌డ్‌ హైర్లు, షేర్‌ గ్యారెంటీలు మిగతా రెండిటికీ రావడం లేదు. మిగిలిన చిత్రాల రేంజ్‌ ఒక స్థాయికి పరిమితం అవుతుందని, వినయ విధేయ రామకి మాత్రం బాక్సాఫీస్‌ని శాసించే సత్తా వుందని ట్రేడ్‌ వర్గాల వారు విశ్వసిస్తున్నారు.

విడుదలైన తర్వాత ఏ సినిమా ఎక్కువ బాగుందనేదే సక్సెస్‌ని డిసైడ్‌ చేస్తుంది కానీ విడుదలకి ముందు హంగామాలో మాత్రం 'వినయ విధేయ రామ' సందడిని మ్యాచ్‌ చేయడం వెటరన్ల సినిమాల వల్ల కావట్లేదు. అందులోను రంగస్థలంతో రామ్‌ చరణ్‌ ఊపు మీద వుండడంతో ఆ ప్రభావం చేత కూడా 'వినయ విధేయ రామ'ని ఎవరూ తక్కువ అంచనా వేయట్లేదు.

చంద్రబాబును దింపడమే నా లక్ష్యం... ఆయన్ను అసహ్యించుకుంటున్నారు 

అప్పట్నుంచి ఇండియాలో పోర్న్ వీక్షణ పెరిగింది!

Show comments