రాక్షసన్ జిరాక్స్ రాక్షసుడు

రీమేక్ వేరు జిరాక్స్ వేరు. బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు సినిమా ట్రయిలర్ చూస్తుంటే, దాని తమిళ మాతృక రాక్షసన్ కు జిరాక్స్ అందిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతుంది. సాధారణంగా రీమేక్ లు మెయిన్ అయిడియా, కీలక సన్నివేశాల్లో ఒరిజినల్ మూవీని అంటిపెట్టుకుని వెళ్లడం కామన్, కానీ దర్శకులు, కాస్త తమదైన స్టయిల్, కెమేరా బ్లాక్ లు, డైలాగులు, ఇతరత్రా కాస్తయినా మార్చాలని అనుకుంటారు.

కానీ రాక్షసుడు తెలుగు సినిమా దర్శకుడు రమేష్ వర్మ మాత్రం మాతృక రాక్షసన్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోయినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ ను పక్కన పెట్టుకుని, అదే విధంగా కేమేరా యాంగిల్స్ దగ్గర నుంచి డైలాగుల వరకు ఫాలో.. ఫాలో.. అంటూ ఫాలో అయిపోయినట్లు కనిపిస్తోంది.

ఈ జిరాక్స్ సంగతి అలావుంచితే మాతృకలోని థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ ను క్యాచ్ చేయడంలో బాగానే కష్టపడ్డట్లు కనిపిస్తోంది. హీరో బెల్లంకొండ కూడా ఆ పాత్రలోకి మారడంలో బాగానే వర్కవుట్ చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్టు 2న విడుదలయ్యే ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు.

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

 

Show comments