రాక్షసన్ రీమేక్ ప్రారంభం

తమిళంలో మంచి హిట్ అయిన రాక్షసన్ సినిమా తెలుగు రీమేక్ కు ఈరోజు శ్రీకారం చుట్టారు. రమేష్ వర్మ డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించే ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హీరో కోనేరు హవీష్ సమర్పిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ బయట హీరోతో నిర్మించే తొలి సినిమా ఇది.

ప్రస్తుతం బెల్లంకొండ చేస్తున్న అనిల్ సుంకర-తేజ కాంబినేషన్ లోని సీత సినిమా విడుదలకు సిద్దమైంది. తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమాను స్టార్ట్ చేసారు. రాక్షసన్ తెలుగు వెర్షన్ కు గిబ్రాన్ సంగీతం, సాగర్ సంభాషణలు అందిస్తారు.

కాస్టింగ్ సెలక్షన్ జరగాల్సి వుంది. రామానాయుడు స్టూడియోలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్మాతలు అనిల్ సుంకర, బెల్లంకొండ శ్రీనివాస్, కోనేరు హవీష్ తదితరులు హాజరయ్యారు.

రాయలసీమ రైతుల పుండుపై కారం