గరుడవేగ సీక్వెల్ రెడీ.. నాకు మాత్రం తెలీదు

కల్కి తర్వాత గరుడవేగ సినిమా చేస్తానని ప్రకటించాడు హీరో రాజశేఖర్. అయితే ఆ ప్రకటనలో కూడా చిన్నపాటి గందరగోళం సృష్టించాడు. వినిపించీ వినిపించనట్టు, దాచీదాచనట్టు అరకొరగా చెప్పి సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అవును.. సీక్వెల్ ఉంది కానీ తనకు తెలియదంటున్నాడు ఈ సీనియర్ హీరో.

"గరుడవేగ-2 ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేయాలి. సి. కల్యాణ్ ప్రొడ్యూస్ చేస్తే సూపర్ గా ఉంటుంది. సబ్జెక్ట్ నేను వినలేదు. వాళ్లు డిస్కస్ చేసుకున్నారు. చాలా బాగుందని చెప్పేశారు. గరుడవేగ కంటే నెక్ట్స్ లెవెల్ లో ఉందని చెప్పారు. నాకు ఎప్పుడు వినిపిస్తారో చూడాలి."

ఇలా గరుడవేగ సినిమాపై వెరైటీగా రియాక్ట్ అయ్యాడు రాజశేఖర్. ఈ సినిమా స్టోరీ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుకున్నారట. తనకు మాత్రం తెలియదట. కానీ కల్కి తర్వాత చేస్తే గరుడవేగ-2 సినిమానే చేస్తానని ప్రకటించాడు.

కల్కి సినిమా థియేట్రికల్ ట్రయిలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు రాజశేఖర్. దీనికి థియేట్రికల్ ట్రయిలర్ అని కాకుండా హానెస్ట్ ట్రయిలర్ అని పేరుపెట్టుకున్నారు. ఫంక్షన్ అయితే చేశారు కానీ ట్రయిలర్ మాత్రం రిలీజ్ చేయలేకపోయారు.

టెక్నికల్ కారణాల వల్ల నిన్న రిలీజ్ చేయాల్సిన ట్రయిలర్ ను ఈరోజు 10 గంటలకు విడుదల చేయబోతున్నారు. అంటే.. నిన్న ఫంక్షన్ చేసి, ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేస్తున్నారన్నమాట.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా

Show comments