రాజశేఖర్ కు అస్వస్థత

హీరో రాజశేఖర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాని కారణంగా ఈరోజు ఆయన చేయాల్సిన కొన్ని ప్రమోషన్ యాక్టివిటీలు క్యాన్సిల్ చేసారు. అలాగే ఈ సాయంత్రం కల్కి సినిమా కోసం ఓ ప్రీరిలీజ్ ఫంక్షన్ కూడా చేయాల్సి వుంది. దాన్ని కూడా క్యాన్సిల్ చేసారు.

నిన్నటి నుంచి రాజశేఖర్ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కాస్త తగ్గిందని యూనిట్ వర్గాల బోగట్టా. మరి కాస్త తగ్గితే సాయంత్రం ఛానెళ్లలో కల్కి సినిమా ప్రమోషనల్ ఇంటర్వూలలో పాల్గొంటారు. లేదూ అంటే అవి కూడా క్యాన్సిల్ అవుతాయి.

కల్కి సినిమాకు రాజశేఖర్ కాస్త ఎక్కువే వర్క్ చేసారు. ఆ సినిమా మీద రాజశేఖర్ కు చాలా ఆశలు వున్నాయి. గరుడవేగ హిట్ తరువాత కల్కితో మరో హిట్ పడితే, మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వస్తాడు.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ