రాజశేఖర్ గొప్పోడే

మనకు అవసరం లేనంత వున్నపుడు దానం చేయడం గొప్పకాదు, మనమే అవసరంలో వున్నపుడు దానం చేయడం గొప్ప. హీరో రాజశేఖర్ స్థితిమంతుడే. కానీ ప్రస్తుతం కాస్త ఆర్ధికంగా టైట్ పొజిషన్ లో వున్నారు. చటుక్కున ఇలాతీసి అలా ఇచ్చే పరిస్థితి అయితేకాదు. కానీ అలాంటి టైమ్ లో 10 లక్షలు మా సంస్థకు విరాళంగా ప్రకటించడం విశేషమే కదా.

ప్రస్తుతం సినిమా నటీనటుల సంఘం 'మా' పరిస్థితి ఏమీ బాగా లేదు. సంస్థకు వున్న ఫిక్స్ డ్ డిపాజిట్ల్ మీద వచ్చిన వడ్డీతో కార్యక్రమాలు సాగించడం అన్నది అనాదిగా జరుగుతోంది. వీటితోనే వృద్ద కళాకారులకు పింఛన్లు కూడా ఇస్తుంటారు. నరేష్ తన ఎన్నికల ప్రచారంలో ఈ పింఛను పెంచుతానని మాట ఇచ్చారు. పెంచేసారు.

కానీ నిధులు ఎక్కడి నుంచి తేవాలి? గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా, లేదా కొంతమంది విరాళాలు ఇవ్వడం ద్వారా నిధులు పోగుచేయడం అన్నది కామన్. కానీ ఈ మధ్య నరేష్ వచ్చాక అలాంటి వ్యవహారాలు ఏవీలేవు. దీంతో సంస్థ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. ఎప్పుడో మళ్లీ ఛారిటీ కార్యక్రమాలు చేయాలి. డబ్బులు రావాలి. లేదా కొందరయినా డొనర్లు ఇవ్వాలి. అంతవరకు బండి నడిచేదెలా?

ఈ పరిస్థితి చూసి, సంస్థ కార్యక్రమంలో కీలకంగా వున్న రాజశేఖర్ తనే 10 లక్షలు తీసుకువచ్చి ఇచ్చారట. తనే ముందు అడుగువేస్తే మిగిలినవారు కొంతయినా ముందుకు వస్తారని, సినిమా జనాలు కాస్తయినా సాయం చేస్తారని ఆయన ఆశ అని తెలుస్తోంది.

నాని చెప్పినట్లే సినిమా ఉందా..? ఫ్యామిలీ గ్యాంగ్‌ సంగతేంటి?