రాజమౌళి చెబితే చిరంజీవి వింటారా?

సాహో సినిమా రన్ టైమ్ విషయంలో ఆఖరి నిమిషంలో రాజమౌళి రంగంలోకి దిగాడు. నిడివి తగ్గించడం కోసం కొన్ని సూచనలు చేశాడు. ఇప్పుడు సైరా సినిమాకు కూడా రన్ టైమ్ సమస్య వచ్చింది. దీన్ని కూడా కాస్త ట్రిమ్ చేయాలి. ఇక్కడ కూడా రాజమౌళినే రంగంలోకి దిగబోతున్నాడు. ఈ మేరకు జక్కన్నను, నిర్మాత రామ్ చరణ్ సంప్రదించినట్టు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ రాజమౌళి చెబితే చిరంజీవి వింటారా అనేది సమస్య!

రామ్ చరణ్-రాజమౌళి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. పైగా ఇద్దరూ కలిసి ఇప్పుడు ఓ సినిమా కూడా చేస్తున్నారు. ఆ చనువుతో సైరా సినిమాను ఓసారి చూడమని రాజమౌళిని రిక్వెస్ట్ చేశాడట రామ్ చరణ్. ప్రస్తుతం బల్గేరియాలో ఉన్న రాజమౌళి, ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే సైరా సినిమా చూస్తానని మాటిచ్చాడట.

విడుదలకు ముందు రాజమౌళి, సైరా సినిమా చూడడం పక్కా. కాకపోతే అతడికి సినిమాను స్నేహపూర్వకంగా చూపిస్తారా లేక పెరిగిన రన్ టైమ్ ను తగ్గించే క్రమంలో చూపించబోతున్నారా అనేది తేలాల్సి ఉంది. సినిమా జడ్జిమెంట్ లో రాజమౌళికి మంచి పట్టు ఉంది. అందుకే అతడికి చూపించి సలహాలు తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట.

అయితే జక్కన్న చెప్పే సూచనలను చిరంజీవి పాటిస్తారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే తన సినిమాలకు సంబంధించి అంతిమ నిర్ణయం ఎప్పుడూ చిరంజీవిదే. ఈ విషయంలో ఒక్కోసారి అల్లు అరవింద్ మాట కూడా ఆయన వినరు. అలాంటిది రాజమౌళి చెప్పే సూచనలు, సలహాల్ని చిరు పాటిస్తారా, అసలు తన సినిమాలో రాజమౌళిని వేలు పెట్టనిస్తారా అనేది చూడాలి. 

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!