రాజకీయాల నుంచి తప్పుకుంటా: హేమమాలిని

ప్రముఖ నటి , బిజెపి ఎమ్.పి హేమమాలిని త్వరలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విశేషం . ఆమె ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విశేషాలు కూడా చెప్పారు.

తాను కుటుంబంతో కలిసి ఉండాలని అనుకుంటున్నానని, అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.ప్రముఖ నటుడు ధర్మేంద్రను తాను వివాహం చేసుకున్నానని, కాని ఆయన మొదటి భార్య నుంచి , ఆ కుటుంబం నుంచి ఆయనను వేరు చేయలేదని ఆమె చెప్పారు.

దర్మేంద్రను చూడగానే సొంత మనిషి వలే అనిపించందని, ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, కాని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టరాదని భావించానని ఆమె చెప్పారు.1979లో వీరి వివాహం జరిగింది.

Show comments