రాహుల్ గాంధీ చాలా హాట్ అంటున్న హీరోయిన్!

ఇది వరకే ఒకసారి రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది కత్రినా కైఫ్. అప్పట్లో కత్రినా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ గయ్యిమంది. తను హాఫ్ ఇండియన్ అని గతంలో చెప్పిన కత్రినా.. తనను తాను రాహుల్ తో పోల్చుకుంది. రాహుల్ గాంధీ కూడా హాఫ్ ఇండియన్ అన్నట్టుగా మాట్లాడింది. దీంతో ఆ మాటలు కాంగ్రెస్ వాళ్లకు కోపాన్ని తెప్పించాయి. కత్రినాపై వాళ్లు విరుచుకుపడ్డారు. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకొమ్మన్నారు.

గతంలో అలా రాహుల్ ను ఇబ్బంది పెట్టిన కత్రినా ఈసారి మాత్రం అతడికి కితాబిచ్చింది. నీ లెక్కలో హాటెస్ట్ పొలిటీషియన్ ఎవరు? అని ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు కత్రినా బదులిస్తూ.. ఇద్దరి పేర్లు చెప్పింది. వారిలో ఒకరు అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కాగా.. రెండోవ్యక్తి మరెవరో కాదు.. ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. వీళ్లిద్దరూ హాటెస్ట్ పొలిటీషియన్స్ అని కత్రినా తన అభిప్రాయాన్ని చెప్పింది.

మొత్తానికి రాహుల్ గాంధీ జనసామాన్యాన్ని ఏ మేరకు ఆకట్టుకున్నాడో కానీ.. హాట్ హీరోయిన్ చేత మాత్రం హాట్ అనిపించుకుంటున్నాడు. ఇంకా రాజకీయాల గురించి చెప్పంటే మాత్రం తనకు పెద్దగా అవగాహన లేదని కత్రినా చెప్పుకొచ్చింది.