రఘువీరా.. ఏమిటీ నిస్సిగ్గుతనం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ముడిపెట్టి మాట్లాడేస్తున్నాడు రఘువీరారెడ్డి. ఈయనగారి నిస్సిగ్గుతనానికి ఇది పరాకాష్ట అని చెప్పొచ్చు. ఇలాంటి మాటలు మాట్లాడేది, మాట్లాడగలిగేది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నేతలే అనుకుంటే.. తమ అవకాశవాదం కొద్దీ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే పాట అందుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ నేతలు మొహాలు ఎక్కడ పెట్టుకుంటున్నారో కానీ.. జగన్ మీద బురదజల్లుతూ మాట్లాడుతున్నారు.

దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతల గమనాన్ని గమనిస్తే.. ఈ రోజు ఏపీలో అయితేనేం, తెలంగాణలో అయితేనేం.. టీడీపీతో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలి. అంతా కట్టగట్టుకు ఉరేసుకోవాలి. అంత నీఛమైనది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల కలయిక. చంద్రబాబుకు అంటే ఒక అజెండా లేదు, ఒక విధానంలేదు, ఒక సిద్ధాంతం లేదు. అవకాశవాదమే చంద్రబాబుకు ఉన్న ఏకైక సిద్ధాంతం.

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు నాయుడు, తెరాసతో చేతులు కలపనందుకు ఎంత బాధపడుతున్నాడో ఆయన మాటలతోనే స్పష్టం అవుతోంది. తెరాసతో పొత్తుకే చంద్రబాబు నాయుడు శతథా ప్రయత్నించాడు. ఆ పొత్తుకు బీజేపీ అడ్డుపడిందని చంద్రబాబు నాయుడు ఏపీ అసెంబ్లీలో వాపోతున్నాడు. ఇలా అవకాశవాది చంద్రబాబు నాయుడు మరో దిక్కులేక తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ తో చేతులు కలిపాడు. రేపోమాపో ఏపీలో కూడా ఆ ముచ్చట పూర్తికానుంది.

ఇలాంటి నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ కూడా అన్నీ వదిలేసినట్టే. కాంగ్రెస్, తెలుగుదేశం అంటూ ప్రజలు తమకంటూ కొన్ని విధానాలను పెట్టుకున్నారు. తమ విధానాలకు అనుగుణంగా దశాబ్దాలుగా ఓటేస్తూ వస్తున్నారు. అలా తమను అభిమానించే ప్రజలను కూడా అవమానిస్తూ కాంగ్రెస్, టీడీపీలు చేతులు కలుపుతూ.. తమకు అవకాశవాదాన్ని చాటుకొంటూ ఉన్నాయి. ఇంత చేస్తూ మళ్లీ ఇద్దరూ కలిసి జగన్ మీద బురదజల్లుతున్నారు. వీరి నిస్సిగ్గుతనంలో ఇది పరాకాష్ట.

Show comments