సెక్స్ సీన్లపై రాధిక అమాయక ప్రశ్న!

షార్ట్ ఫిల్మ్స్ లోనూ, వెబ్ సీరిస్ లలోనూ సెక్స్ సీన్లలో బోల్డ్ గా రెచ్చిపోతూ ఉంటుంది రాధికా అప్తే. ఈ విషయంలో ఆమె ఎలాంటి మొహమాటాలకూ పోదని ఇదివరకే రుజువు అయ్యింది. అలా రాజీపడకుండా, న్యూడ్ గా నటించడానికి మొహమాట పడకుండా సాగుతున్న రాధికకు సంబంధించి ఒక వీడియో రచ్చగా మారింది.

ఒక హాలీవుడ్ సినిమాలో దేవ్ పటేల్ తో కలిసి రాధిక నటించిన సెక్స్ సీన్ లీక్ అయ్యింది. ఆ లీక్ పై రాధిక విరుచుకుపడుతూ ఉంది. కొంతమంది సైకోలు ఆ వీడియోను లీక్ చేశారని ఆమె వాపోతోంది. ఈ సందర్భంగా ఆమె మరో సందేహాన్ని వ్యక్తంచేసింది. అదేమిటంటే.. సెక్స్ సీన్లను కేవలం ఆడవాళ్ల కోణం నుంచే ఎందుకు చూస్తారు? అని రాధికా ఆప్తే ప్రశ్నిస్తోంది.

అంటే ఆ సెక్స్ సీన్లలో ఫలనా హీరోయిన్ నటించిందని వాటిని ఎందుకు హైలెట్ చేస్తారు? అదే సీన్లో మేల్ ఆర్టిస్ట్ కూడా ఉంటాడు కదా.. అతడి పేరును ఎందుకు హైలెట్ చేయరు? అని రాధిక ప్రశ్నిస్తోంది! మొత్తానికి చాలా ఫెమినిస్టిక్ భావజాలంతో, ఎంతో అమాయకమైన ప్రశ్నను అడిగింది రాధికా ఆప్తే. మరి ఈ ప్రశ్నకు సభ్యసమాజమే సమాధానం ఇవ్వాలి!

బ్యూటిఫుల్ హీరోయిన్ తో క్యూట్ యాంకర్ ఇంటర్వ్యూ

పూరి చూసిన ఎత్తుపల్లాలు ఏమిటి

Show comments