పబ్లిక్ మీటింగ్ లో చైతూ.. వెంకీ

మేనల్లుడు చైతూ కోసం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్టరీ వెంకటేష్. అందుకోసం వెంకీమామ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ప్రేక్షకుల ముందుకు రావడానికన్నా ముందుగా ఓ పబ్లిక్ మీటింగ్ లోకి వచ్చారు. రామోజీ ఫిలింసిటీలో ఈ మేరకు కాస్త భారీగానే పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుచేసారు.

పీపుల్స్ మీడియా-సురేష్ ప్రొడక్షన్స్ కలిపి నిర్మిస్తున్న వెంకీ మామ సినిమా షూటింగ్ నిర్విరామంగా ఆర్ ఎఫ్ సిలో జరుగుతోంది. ఎప్-2 తరువాత వెంకీ చేస్తున్న సినిమా ఇది. జై లవకుశ దర్శకుడు బాబీ ఈ సినిమాకు రూపకర్త. వీలయినంత త్వరగా ఫినిష్ చేసి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

ఎఫ్-2 సక్సెస్ వెంకీకి, మజిలీ సక్సెస్ నాగచైతన్యకు రెడీగా వున్నాయి. ఇలాంటి టైమ్ లో సినిమా ఫినిష్ చేసి, విడుదల చేస్తే అటు మార్కెటింగ్ బాగుంటుంది, ఇటు ఓపెనింగ్స్ బాగుంటాయి. అందుకే చకచకా ఫినిష్ చేసి, రెడీ చేసి వుంచే ఆలోచనలో వుంది యూనిట్. ఇప్పటికే కొత్త పార్ట్ ఈస్ట్ గోదావరిలో చిత్రీకరించారు కూడా. 

ఇప్పుడు పోయిన ప్రాణాలను జేసీ సోదరులు తెచ్చిస్తారా?