లాభాలతో ముగిసిన ఫ్లాప్ సినిమా కథ

సిల్లీ ఫెలోస్.. సునీల్, అల్లరినరేష్ కలిసి నటించిన ఈ సినిమాను ఎవరూ హిట్ అనరు. కానీ ఓ విషయంలో మాత్రం ఈ సినిమా  హిట్ కొట్టింది. థియేటర్లలో వసూళ్లు రాకపోయినా, మరో యాంగిల్ లో ఈ సినిమా జాక్ పాట్ కొట్టింది. అదే శాటిలైట్ రైట్స్. అవును.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి.

అవును.. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో జెమినీ టీవీ, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం భారీగా ఖర్చుచేసింది. అలా 4 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి సిల్లీ ఫెలోస్ శాటిలైట్ రైట్స్. పారితోషికాలతో కలుపుకొని సినిమాకు 6 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే.. కేవలం శాటిలైట్ రైట్స్ కిందే 4 కోట్ల రూపాయలు వచ్చేశాయన్నమాట. 

మరోవైపు డిజిటల్ రైట్స్ ను కూడా 75 లక్షల రూపాయలకు అమ్మేశారు. అంటే, థియేట్రికల్ బిజినెస్ కాకుండానే బడ్జెట్ లో దాదాపు 90 శాతం రికవరీ అయిపోయింది. ఈనెల 7న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఫస్ట్ వీకెండ్ దీనికి బాగానే వసూళ్లు వచ్చాయి. 

సగం మంది బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లగా.. చిన్నచిన్న నష్టాలతో మరికొందరు బయటపడ్డారు. సో.. ఓవరాల్ గా చూసుకుంటే సిల్లీ ఫెలోస్ సినిమా ఫ్లాప్ అయినా, బిజినెస్ పరంగా హిట్ కిందే లెక్క. దీనికి మెయిన్ రీజన్ శాటిలైట్ రైట్స్ అని వేరే చెప్పనక్కర్లేదు.

Show comments