ప్రభాస్ తో నాగ్ కు పోటీ ఏలనో?

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో. ఈ సినిమా టీజర్ 13న బయటకు వస్తోంది. వాస్తవానికి ఫస్ట్ వీక్ లో తెద్దామని ప్రయత్నించి, వర్క్ పూర్తికాక,13న తెస్తున్నట్లు బోగట్టా. ఇదిలావుంటే అదేరోజు కింగ్ నాగార్జున క్రేజీ ప్రాజెక్టు మన్మధుడు 2 టీజర్ కూడా వస్తోంది. సాధారణంగా సాహో లాంటి భారీ సినిమా టీజర్ వస్తోందని తెలిసినపుడు మరో సినిమా టీజర్ వుంటే అది ముందురోజో, వెనుక రోజో విడుదల చేస్తారు. కానీ మన్మధుడు 2 టీజర్ అదేరోజు వస్తోందని ప్రకటించేసారు.

ఇదిలావుంటే సినిమా విడుదల విషయంలో కూడా నాగ్ వైఖరి ఇలాగే వుందని తెలుస్తోంది. ఆగస్టు 9న మన్మధుడు 2 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 15న సాహో విడుదల. అలాంటి పెద్ద సినిమా వారంలో విడుదల వుంటే, ముందువారం సినిమా వేయడానికి ఆలోచిస్తారు. ఎంతకాదన్నా సాహో వ్యవహారం వేరు. దానికోసం మన్మధుడు 2ను కొన్ని థియేటర్లలోంచి అయినా తీసేసే ప్రమాదం వుంది.

పైగా సాహోకి ఏస్ డిస్ట్రిబ్యూటర్లు, దిల్ రాజు, గీతా, యువి లాంటి సంస్థల బ్యాకింగ్ వుంది. నాగ్ కు కూడా థియేటర్ల సమస్య రాదు కానీ వారం తరువాత కలెక్షన్ల విషయంలో, థియేటర్ల విషయంలో సమస్య వచ్చే అవకాశం వుంది. కానీ నాగార్జున 9న విడుదలకే పట్టుదలగా వున్నారని తెలుస్తోంది.

టీజర్ సేమ్ డే. రిలీజ్ వన్ వీక్ బిఫోర్. ట్రయిలర్ సంగతి ఏమిటో మరి?

సవాల్ చేశారుగా.. సీమ పౌరుషాన్ని చూపుతారా?