ప్రభాస్‌కి ఇది వార్నింగ్‌ సైన్‌

మూడు వందల కోట్ల ప్రాజెక్ట్‌ చేస్తున్నపుడు ఆ బాధ్యతని అనుభవం వున్న దర్శకుడి చేతిలో పెట్టాలి. కనీసం పదికోట్ల బడ్జెట్‌ అయినా లేని సినిమా తీసిన దర్శకుడికి అంత పెద్ద ప్రాజెక్ట్‌ అప్పగించడం అతనిపై ఒత్తిడి పెంచడమే కాకుండా అతని పనితీరుని కూడా ప్రభావితం చేస్తుంది. బాహుబలి తర్వాత మళ్లీ అదే స్థాయి సినిమా చేయాలనే ప్రయత్నంలో 'రన్‌ రాజా రన్‌' దర్శకుడు సుజీత్‌తో 'సాహో' చేసారు.

అతనితో ప్రభాస్‌ సినిమా చేయాలని కమిట్‌ అయిన టైమ్‌లో ప్రభాస్‌కి మిర్చి పెద్ద హిట్‌. అంటే యాభైకోట్ల మార్కెట్‌ వున్న టైమ్‌లో అంగీకరించిన సినిమాని తన మార్కెట్‌ మూడొందల కోట్లు అయ్యాక కూడా ప్రభాస్‌ అలాగే కొనసాగించాడు. అనుభవం లేని దర్శకుడి వల్ల సాహో చాలా సమయం తీసుకుంది. చివరకు రిలీజ్‌ డేట్‌కి రాలేక వాయిదా పడింది. ఆగస్టు 30కి అయినా ఈ చిత్రం వస్తుందా అనేది అనుమానంగానే వుంది.

ఇదిలావుంటే ప్రభాస్‌ మలి చిత్రం కూడా ఒక్క సినిమా అనుభవం వున్న దర్శకుడు రాధాకృష్ణతో చేస్తున్నదే. జిల్‌ కాకుండా మరో సినిమా తీసి ఎరుగని అతనితోను భారీ బడ్జెట్‌ సినిమానే తీస్తున్నారు. సాహోకి జరిగిన వాటితో పాఠం నేర్చుకుని ఆ చిత్రానికి అయినా జాగ్రత్త పడతారో లేదో మరి. 

ఆమెను ఆమెగా ప్రేమించేవాడే కావాలట..!

ఎన్ని సినిమాలు పోయినా తీస్తూనే ఉంటా..