నువ్వు నన్నుగిచ్చితే, నేను నిన్ను కొరుకుతా

తనపై తప్పుడు వార్తను ప్రసారం చేసినందుకు ఏబీఎన్ రాధాకృష్ణపై ఫైర్ అయ్యారు నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి. ప్రెస్ మీట్ పెట్టి మరీ రాధాకృష్ణను ఉతికి ఆరేశారు. తను నడవడానికి ఇబ్బంది పడుతున్నానని, అందుకే వ్యక్తిగతంగా హాజరుకాలేనని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తే, దాన్ని రాధాకృష్ణ వక్రీకరించారని మండిపడ్డారు.

"నువ్వు (రాధాకృష్ణ) నాతో పెట్టుకోకు. ఎందుకంటే నేను ఎదవని కాదు. వెధవలతో పెట్టుకో. నేను ఓ కుటుంబీకుడ్ని. గౌరవంగా బతుకున్నాను. నీకు మీడియా ఉందని ఫుట్ బాల్ ఆడుకుందాం అనుకుంటే, అంతకంటే పెద్ద బాల్ తో కొడతా. మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నామీద తప్పుడు వార్తలు రాయొద్దు."

తనకున్న ఆరోగ్య సమస్య గురించి వివరించారు పోసాని. సినిమా షూటింగ్స్ వల్ల సర్జరీ చేయించుకోలేకపోతున్నాననంటూ డాక్టర్ ఇచ్చిన కాగితాన్ని మీడియాకు చూపించారు. రాధాకృష్ణలా పైకి చెప్పుకోలేని రోగాలు తనకు లేవని, ఉన్నది ఉన్నట్టు చెప్పానని అంటున్న పోసాని, రాధాకృష్ణ మాత్రం పూర్తిగా వక్రీకరించి వార్తలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు.

"నా గురించి నువ్వు (రాధాకృష్ణ) ఎలాగైతే మీడియాను వాడుకుంటున్నావో, నువ్వు తప్పు చేస్తే నేను కూడా అలానే మీడియాను వాడుకుంటాను. మీడియా అంటే నువ్వు ఒక్కడివే కాదు. మీడియా కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లు ఉన్నారు. చదివి నేర్చుకో. కొన్నాళ్లయినా మనిషిగా బతుకు. ముక్కు, చెవులు, కళ్లు, కలర్ ఉంటే చాలదు. విలువలు, మానవత్వం, నిజాయితీ ఉండాలి. అవి ఏ పాళ్లు నీ దగ్గరున్నాయో నిన్ను నువ్వు ప్రశ్నించుకో."

తను తీసిన సినిమాపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే, దానికి ప్రత్యుత్తరంగా పోసాని తన ఆరోగ్య సమస్యను తెలుపుతూ మరో లేఖ రాశారు. ఆ లేఖను సంపాదించిన రాధాకృష్ణ, తనపై ఉన్నవి లేనివి మిక్స్ చేసి వార్తలు వండి వార్చారనేది పోసాని ఆరోపణ.

చంద్రబాబును విమర్శించడానికి, అన్-పాపులర్ చేయడానికి ప్రత్యేకంగా సినిమా తీయనక్కర్లేదన్న పోసాని.. చంద్రబాబు గురించి అందరికీ తెలుసని, మరీ ముక్యంగా రాధాకృష్ణకు ఇంకా బాగా తెలుసన్నారు. కాకపోతే రాధాకృష్ణ మనసు చంపుకొని బతికేస్తున్నాడని ఇకనైనా మనిషిగా బతకాలని కోరారు పోసాని.

Show comments