జగన్.. జగన్.. ఈకలు పీకుతున్న పవన్!

ఎన్నికల ప్రచార సభల్లో అయినా అధికార పక్షాన్ని మాట మాత్రమైనా విమర్శించాలని పవన్ కల్యాణ్ మరిచిపోతున్నట్టుగా ఉన్నారు! ఎంతసేపూ.. జగన్.. జగన్.. అంటూ కలవరించడమే సరిపోతూ ఉంది జనసేన అధిపతికి. అధికారంలో ఉన్నది జగన్ అని అనుకుంటున్నారో.. లేక పవన్ కల్యాణ్ మతి భ్రమించిందో కానీ.. ఎన్నికల ప్రచార సభల్లో కూడా జగన్ మీదే పవన్ ప్రసంగాలు సాగుతూ ఉన్నాయి.

శ్రీమాన్ పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యానం ఏమిటంటే.. జగన్ ఎందుకు కడప సీటును బీసీలకు కేటాయించడం లేదు? అనేది! భలే లాజిక్ పట్టాడు పో! జగన్ బీసీ సదస్సులు అంటూ నిర్వహించడం తప్పని పవన్ కల్యాణ్ తేల్చేశాడు. జగన్ ఏం చేసినా నీకు తప్పే.. ప్రతి దాంట్లోనూ జగన్ ను ఎంచడమే నీ పని అయినప్పుడు.. నిన్ను ఎంటర్ టెయిన్ చేయడానికి జగన్ తన రాజకీయాన్ని సాగించలేడు కదా.. పవను కల్యాణూ.. అంటూ జనాలు చతుర్లాడుతున్నారు.

అధికార పార్టీని ఐదేళ్ల పాలనలో ఏం చేశారు? అని ప్రశ్నించింది పోయి.. జగన్ ఎందుకు కడప ఎంపీ సీటును బీసీలకు కేటాయించడం లేదు అని పవన్ ప్రశ్నిస్తూ తన ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడంటే, తన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ కు కనిపించిన గొప్ప పాయింట్ ఇదే అంటే.. అది పవన్ కల్యాణ్ దౌర్భాగ్యమని చెప్పాలి.

ఇక తను ముఖ్యమంత్రి కావాలని.. తన ధైర్యమే తనను ముఖ్యమంత్రిని చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. మరి ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అంటే అదేదో పాపం.. అని ఈ మధ్యనే జగన్ ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ ఇచ్చారు కదా! ఇప్పుడేంటి.. మళ్లీ తను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించుకుంటున్నాడు?

ఇక కడప ఎంపీ సీటు గురించి పవన్ మాట్లాడాడు సరే, బీసీల మీద ఇలా ప్రేమ కారిపోతూ ఉంది.మరి అదే కడప సీటును తెలుగుదేశం పార్టీ ఎందుకు బీసీలకు కేటాయించడం లేదో పవన్ అడగడం లేదేందుకు? తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ అన్ని మినహాయింపులూ ఇచ్చేసి, జగన్ విషయంలో మాత్రమే ఈకలు పీకుతున్న పవన్ కల్యాణ్ గురించి ఇక మాట్లాడుకోవడం కూడా టైమ్ వేస్టేనేమో!

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!