ఇదిగో పవన్ సత్తా.. ఇతడే జగన్ ను తిట్టింది!

అనంతపురం జిల్లాలో అనంతపురం నియోజకవర్గం పరిధిలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్నటి రోజున నిర్వహించాల్సిన రైతులతో ముఖాముఖి ప్రోగ్రామ్ రద్దు అయ్యింది. కరువుపై అధ్యయనం చేయడానికి అంటూ పవన్ కల్యాణ్ అనంతపురం వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరునెలల కిందట కూడా ఇలాంటి టూరే వేశాడు. అప్పుడు టీడీపీ నేతళ ఇళ్లకు వెళ్లి వచ్చాడు. అప్పుడు ఏం అధ్యయనం చేశాడో కానీ.. ఇప్పుడు మళ్లీ అధ్యయనం అంటూ వెళ్లాడు పీకే. ఈసారి పవన్ రైతులతో ముఖామఖి అవుతాడని ప్రకటించారు.

అందుకోసం నిన్న ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే.. యథావిధిగా ఫ్యాన్స్ అక్కడ హడావుడి మొదలుపెట్టారు. గ్రామస్తులు  కూడా అక్కడకు వచ్చారు. అది రాయలసీమ... ఎలాగూ వర్షాలు లేవు. దీంతో అంతా నడిచేసరికి మట్టి రోడ్దు మీద దుమ్మురేగింది. అక్కడి జనాలు దానికి ఏమాత్రం ఇబ్బంది పడలేదు కానీ.. పవన్ మాత్రం అక్కడకు వచ్చి తట్టుకోలేకపోయాడు.

తన కారు నుంచి దిగి కొన్ని అడుగులు వేసేసరికే పవన్ దుమ్ముకు ఉక్కిరిబిక్కిరయి పోయాడు.  అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కనిపించగానే.. పవన్ ఏదో ప్రసనంగించేసి.. అక్కడి నుంచినే వెనుదిరిగాడు! రైతులతో ముఖాముఖి అంటూ వెళ్లిన పవన్ కల్యాణ్.. దుమ్ము రేగిందని చెప్పి అక్కడ నుంచి తిరుగుముఖం పట్టాడు.

రైతులతో ముఖాముఖి కార్యక్రమం అ విధంగా రద్దు అయ్యింది. కాసేపు దుమ్ముకు తట్టుకోలేకపోయాడు ఈ నాయకుడు. కామెడీ ఏమిటంటే.. ఇలాంటి పవన్ కల్యాణ్ జగన్ పాదయాత్రను విమర్శించడం! ఏడాది కాలం నుంచి చలికి, ఎండకు, వానకు, దుమ్ముకూ ధూళికి జగన్ పాదయాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు.

రాయలసీమలో జగన్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చలికాలం. సీమలో చలికాలం ఉదయాలు ఎలా ఉంటాయో అక్కడి వాళ్లకు తెలుసు. చలి శరీరాన్ని కోత కోసేస్తుంది. ఊరవతల డేరాల్లో జగన్ స్టే చేశాడు. చేల మధ్యలో టెంట్స్ లో ఉంటూ వచ్చాడు. ఇక పాదయాత్ర మొదలయ్యే సమయానికి సహజంగానే దుమ్ము రేగుతుంది. పగలంతా జగన్ ఆ దుమ్మూధూళి మధ్యనే నడుస్తూ వచ్చాడు.

చలికాలం అయిపోయింది, ఎండాకాలం వచ్చింది. జగన్ పాదయాత్ర కొనసాగింది. ఆ తర్వాత వర్షాకాలం, మళ్లీ శీతాకాలం వచ్చినా జగన్ పాదయాత్ర సాగుతూ ఉంది. ఇదీ జగన్ స్టామినా. ఈ యాత్ర గురించి పవన్ కల్యాణ్ ఇష్టానుసారం పేలుతూ ఉన్నాడు. దుమ్మురేగిందని రైతులతో ముఖాముఖిని రద్దు చేసుకువెళ్లిన ఇతడికి జగన్ పాదయాత్ర గురించి మాట్లాడే అర్హతైనా ఉంటుందా?

రేణుదేశాయ్ పై మౌనంగా ఉండడం మగతనమా?

మంత్రిగారికి ఓటమి తప్పదు.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments