ఔన్లే పవన్.. నువ్వు అలా ఎందుకు మాట్లాడతావ్!

‘జగన్ లా నేను మాట్లాడను..” అన్నాడు పవన్ కల్యాణ్. తన గురించి తాను అనునిత్యం సర్టిఫికెట్స్ ఇచ్చుకునే పవన్ ఈరోజు కొత్త టాపిక్ పట్టుకొచ్చాడు. పార్టీ పెట్టి ఐదేళ్లు అవుతున్నా పవన్ కు ఇంకా తన గురించి, తన మనస్తత్వం గురించి చెప్పుకోవడమే సరిపోతోంది. తను ఇంటర్లో ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నది, అంతకు ముందు టెన్త్ ఉన్నప్పుడు ఏం కావాలనుకున్నదీ చెబుతూ తిరుగుతున్నాడు పవన్.

తాజాగా తనకూ.. జగన్ కు ఒక పోలికను చెప్పుకున్నాడు. ఆ మధ్య నంద్యాల బైపోల్ అప్పుడు జగన్ ఒకమాట అన్నాడు కదా.. ‘బాబును నడిరోడ్డులో కాల్చినా తప్పులేదు..” అని. ఆ మాట ఇప్పుడు పవన్ కు గుర్తుకు వచ్చింది. తను అలా మాట్లాడను అని పవన్ చెప్పుకొచ్చాడు.

నిజమే.. పవన్ స్టైల్ వేరు కదా. ‘పంచెలు ఊడగొట్టాలి..” ‘భగత్ సింగ్ ఆత్మహత్య.. ‘ తరహాలో ఉంటాయి కదా.. పవన్ మాటలు. అందుకే తను జగన్ లా మాట్లాడను అని పవన్ చెప్పుకుంటున్నాడు. పవన్ కల్యాణ్ కు ఈ గురివింద మాటలతోనే సరిపోతోంది. వేరే వాళ్లతో పవన్ కల్యాణ్ ను పోలిక పెడితే అస్సలు సహించడు.

పార్టీ పెట్టి, పద్దెనిమిది స్థానాల్లో గెలిచి.. విలీనం చేశారేంటయ్యా, అది పద్ధతేనా.. జగన్ అలా చేయలేదే.. అంటే ఆ విషయంలో వీళ్లకు పోలికలు వద్దు. జగన్ ఏదో ఎప్పుడో మాట్లాడాడు అంట.. ఈయన అలా మాట్లాడడు అట. మీ నుంచి జాలువారిన ఆణిముత్యాలకు కొదవలేదు కదా పవనూ. ఎందుకు ఈ గురివింద తీరు!

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది

Show comments