సమస్యలున్నందునే ఆర్‌ఈసీపీలో చేరలేదు

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా రూపుదిద్దుకోలేదు. ఈ ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ఆర్‌సీఈపీ తృతీయ సదస్సులో తాము లేవనెత్తిన పలు అంశాలకు పరిష్కారం చూపనందునే భాగస్వామ్య ఒప్పందంలో భారత్‌ చేరలేదని వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. 

రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. దేశీయ రంగాల మనుగడ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఆర్సీఈపీలో వివిధ అంశాలపై సమతుల్యత సాధించే దిశగా ప్రయత్నాలు జరిగినట్లు ఆయన తెలిపారు.

ఆర్‌సీఈపీ దేశల మధ్య సరుకులు, సేవల వాణిజ్యాన్ని విస్తృతపరచడంతోపాటు ఈ దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహన్నికూడా పెంచాలన్నది భాగస్వామ్యం లక్ష్యం అని అన్నారు. ఆగ్నేయ దేశాల సంఘం (ఆసియన్)తో వస్తు, సేవల వాణిజ్యానికి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు, నవంబర్ మాసాలలో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

Show comments