ఫలించని బాబు 'కుట్ర'

నేను ఊక తెస్తా, నువ్వు అటుకులు పట్రా.. రెండూ కలుపుకుని, ఊదుకుని తిందాం అన్నాడట వెనకటికి ఓ తెలివైనవాడు. ఇతగాడి దగ్గర వున్నది ఊక. దాన్నే పెట్టుబడిగా పెట్టి, అవతలవాడి అటుకుల్లో వాటా కొట్టేద్దామనుకున్నాడు.

కానీ అవతలి వాడు అంతకన్నా తెలివైన వాడు. ఇతగాడి దగ్గర పొల్లు (ఊక) తప్ప ఏమీలేదని తెలిసి పక్కన పెట్టాడు.

మొదటివాడు చంద్రబాబు. రెండవవాడు కేసిఆర్...

చంద్రబాబుది ఎప్పుడూ ఒకటే ఐడియా. ఎవడు బలమైన వాడు. ఎవడి టైమ్ బాగుంది అన్నదిచూసి, వాళ్లతో పొత్తు పెట్టుకుని, అధికారం కొట్టేయడం. అసలు అవతలి వాడు పొత్తుకు ఒప్పుకునే వరకు రకరకాల మార్గాల్లో పైరవీ సాగించడం.

2014లో మోడీ టైమ్ బాగుందని గమనించి, తనే వెళ్లి, దండాలు పెట్టి, తన సామాజిక బంధాలు వాడి, భాజపాను మంచి చేసుకుని మొత్తానికి అధికారం సాధించారు. ఇక మోడీ దగ్గర ఏమీలేదని తేలిపోయాక వదిలేసారు.

అదే ప్లాన్ 2018లో తెలంగాణలో అమలు చేద్దాం అనుకున్నారు. తన సామాజిక మిత్రుల సాయంతో కేసిఆర్ ను ఎలాగైనా తనతో నెయ్యానికి ఒప్పిద్దామనుకున్నారు. ఇద్దరూ కలిస్తే తిరుగే లేదనే రాతలు రాయించుకున్నారు.

కానీ బాబుతో కలిసి, అతగాడేమిటో అనుభవం అయిన వారి జాబితాలో కేసిఆర్ కూడా వున్నారు. అందుకే కలయికకు ససేమిరా అన్నారు. బాబు సామాజిక జనాలు ఎవరి స్థాయిలో ఎవరు ఎంత పైరవీలు, లయిజినింగ్ లు చేసినా కేసిఆర్ దిగిరాలేదు. కారులో బాబుకు లిఫ్ట్ ఇవ్వడానికి అంగీకరించలేదు.

దాంతో బాబుగారికి ఏం చేయాలో తోచలేదు. స్వంతంగా వెళ్లలేరు. అలా అని వుండలేరు. అందుకే కాంగ్రెస్ ను ముగ్గులోకి దింపారు. మనం మనం కలిస్తే సూపరెహె అన్నారు. కాంగ్రెస్ మెడలు వంచి, తనకు కావాల్సిన సీట్లన్నీ ఏరి, కోరి మరీ తీసుకున్నారు.

కానీ పాపం ఏమయింది. ఇప్పుడు బాబుగారి అసలు స్టామినా బయటపడిపోయింది. 13 సీట్లు తీసుకుంటే రెండు కూడా రాలేదు చేతిలోకి. ఇదేకనుక కేసిఆర్ ను ఏదో విధంగా బాబు సామాజిక వర్గ అభిమానులు చేసిన ప్రయత్నాలు ఫలించి, కేసిఆర్ తలవొగ్గి కాసిన్ని సీట్లు విదిలించి వుంటే, అవన్నీ గెలిచి, బాబుగారు తల ఎగరేసి, రెండు వేళ్లు చూపించి, నవ్వు మొహం పెట్టి, చూసారా? తెలుగుదేశం ప్రతాపం, నా స్టామినా అని ఘనంగా చెప్పుకుని వుండేవారు.

ఆయన అను'కుల'మీడియా.. బాబు ఘనతను ఘనంగా అచ్చేసి పంచేసి మురిసిపోయి వుండేది. ఎంత ప్రమాదం తప్పింది?

తెలంగాణ తీర్పు ప్రభావం.. ఏపీపై ఉంటుందా?

Show comments