రూ.150 కోట్లు.. స్టార్ హీరోకి సరైన హిట్!

ఒక సినిమాకు వసూళ్లు వస్తే.. సినిమా బాగోలేదన్నారు. మరో సినిమా బాగుంది కానీ.. వసూళ్లు లేవన్నారు. ఇంకో సినిమా సూపర్ హిట్ అయినా.. కొన్ని ప్రాంతాల్లో భారీ రేట్లకు అమ్ముడుపోవడం వల్ల అందుకు తగ్గట్టుగా డిస్ట్రిబ్యూటర్లకు రాబడిలేదు. ఇవీ రజనీకాంత్ గత మూడు సినిమాల ఫలితాలు.

కబాలి సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. భారీ వసూళ్లూ దక్కాయి. అయితే అది ప్రేక్షకులకు తలపోటుగా నిలిచింది. ఇక కాలా సినిమా బాగానే ఉన్నా.. కబాలి ఇచ్చిన అనుభవంతో ప్రేక్షకులు ఆ సినిమా వైపు చూడలేదు. ఇక రోబో టూ భారీ అంచనాలతో వచ్చింది.

భారీ ఓపెనింగ్స్ కూడా పొందింది. తమిళంలో, హిందీలో కలెక్షన్ల పరంగా కూడా హిట్ అయ్యింది. అయితే.. తెలుగులో మాత్రం ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిల్చింది. ఇలా ఏదో ఒక లోటుతో నిలిచాయి రజనీకాంత్ సినిమాలు.

అయితే ఈ హీరో తాజా సినిమా 'పేట' మాత్రం మూడు సినిమాల లోటును పూరిస్తోంది. ఈ సినిమాపై అత్యంత భారీ అంచనాలు లేవు. అత్యంత భారీ బడ్జెట్టు, ప్రీరిలీజ్ మార్కెట్ కూడా వందల కోట్లలో లేదు. ఇలా అంచనాలు లేని, వందల కోట్ల నంబర్లు లేని సినిమానే రజనీకి పరిపూర్ణమైన హిట్ ను ఇస్తున్నట్టుగా ఉంది.

వారం ముగిసే సరికల్లా ఈ సినిమా నూటా యాభైకోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. యూఎస్ లో కూడా ఈ సినిమా గ్రాస్ వసూళ్లు పద్నాలుగు కోట్ల రూపాయలను క్రాస్ చేశాయని సమాచారం.

కేవలం కలెక్షన్ల లెక్కలే కాకుండా.. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలూ వచ్చాయి. అటు పాజిటివ్ రివ్యూలు, ఇటు కలెక్షన్లతో.. రోబో టూతో పోలిస్తే తక్కవ స్థాయి కలెక్షన్లే అయినా.. తక్కువ స్థాయి బడ్జెట్, ప్రీరిలీజ్ మార్కెట్ కూడా తక్కువ స్థాయిలోనే ఉండటంతో... రజనీకి అన్ని రకాలుగానూ హిట్ దక్కినట్టే!

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!