పేరు మార్పిడి కలిసివచ్చిందా?

డిజాస్టర్లలో వున్న సాయిదరమ్ తేజ్ కు కాస్త ఊరటనిచ్చిన సినిమా చిత్రలహరి. క్రిటిక్స్ రెస్పాన్స్ ఎలా వున్నా, ఆడియన్స్ నుంచి కాస్త మంచి మద్దతే లభించింది. సమ్మర్ కావడం, హాలీడేస్ రావడంతో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లు అందుకుంది. ఈ సినిమాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మేరకు మార్కెట్ చేస్తే, ఫస్ట్ వీకెండ్ లో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల వరకు రికవరీ వచ్చింది. అంటే బయ్యర్లు గట్టెక్కీసినట్లే అనుకోవాలి. 

ఎందుకంటే మండే నుంచి ఫస్ట్ వీకెండ్ రేంజ్ కలెక్షన్లు కనిపించకపోయినా, మరీ భయంకరమైన డ్రాప్ అయితే వుండదు. అందువల్ల ఫస్ట్ వీక్ లో బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కావడానికి అవకాశం వుంది. సాయిధరమ్ తేజ్ పేరును దర్శకుడు మారుతి తన న్యూమరాలజీ లెక్కల ప్రకారం సాయి తేజ్ గా మార్చారు.

చిత్ర లహరి సినిమాకు ఆ పేరే వాడారు. అందువల్ల ధరమ్ తీసేసి, సాయితేజ్ అని పెట్టుకోవడం వల్ల హీరోకి కాస్త ఊరట ఇచ్చినట్లు కనిపిస్తోంది.

ఫస్ట్ వీకెండ్ కలక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం.............2.66
సీడెడ్.............1.30
వైజాగ్.............1.10
ఈస్ట్.................0.78
వెస్ట్..................0.51
కృష్ణ.................0.60
గుంటూరు.........0.70
నెల్లూరు............0.29

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!