పవన్ కల్యాణ్ సినిమా.. ఈసారి కూడా డిజాస్టర్

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ దెబ్బకి సినిమాలు వదిలేశాడు పవన్. త్రివిక్రమ్ అయితే దారుణంగా విమర్శల పాలయ్యాడు.

ఇక డిస్ట్రిబ్యూటర్లు పత్తాలేకుండా పోయారు. కొంత డబ్బు వెనక్కి ఇచ్చి నిర్మాతలు కూడా నష్టాలు చవిచూశారు. ఇప్పుడీ సినిమా మరోసారి వార్తల్లోకొచ్చింది. వెండితెరపై డిజాస్టర్ గా నిలిచిన అజ్ఞాతవాసి సినిమా బుల్లితెరపై కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

సాధారణంగా ఎంత హిట్ సినిమానైనా 2-3 నెలల గ్యాప్ లో టీవీల్లో ప్రసారం చేస్తుంటారు. కానీ అజ్ఞాతవాసిని మాత్రం ఇదేదో ఆణిముత్యం అనే టైపులో ఇన్నాళ్లూ టెలికాస్ట్ చేయకుండా ఆపారు. ఎట్టకేలకు ఈమధ్య దీపావళి కానుకగా ఈ సినిమాను ప్రసారం చేశారు.

అసలే థియేటర్లలో డిజాస్టర్. మరోవైపు రాంగ్ టైమ్ లో టెలికాస్ట్. దీంతో అత్యల్ప రేటింగ్స్ నమోదయ్యాయి. అజ్ఞాతవాసి సినిమాకు కేవలం 5.3 టీఆర్పీ వచ్చింది. ఓ స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం విడ్డూరం.

మరో డిజాస్టర్ స్పైడర్ కు కూడా టీవీల్లో ఇంత తక్కువ టీఆర్పీ రాలేదు. రిలీజ్ కు ముందు ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని భారీ ధరకు (రూ.19.50 కోట్లు) దక్కించుకుంది జెమినీ టీవీ. కట్ చేస్తే, రిలీజ్ తర్వాత సినిమా డిజాస్టర్ అయింది.

అదే టైమ్ లో 2 నెలల గ్యాప్ లో టీవీల్లో వేయడానికి ప్రయత్నించింది. కానీ డిజాస్టర్ రిజల్ట్ వల్ల సినిమాకు మార్కెట్ జరగలేదు. ఎట్టకేలకు ఈ సినిమాను ప్రసారం చేసి చేతులు దులుపుకుంది జెమినీ టీవీ.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments