పవన్ సాధినేనికి సినిమా

పవన్ సాధినేని... ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు. దాదాపు మూడేళ్లు కావస్తోంది మెగా ఫోన్ పట్టుకుని. మళ్లీ ఇన్నాళ్లకు చాన్స్ దొరికింది. బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు సాయిగణేష్ ను హీరోగా పరిచయం చేసే సినిమాకు పవన్ సాధినేని దర్శకుడిగా ఎంపికయ్యారని బోగట్టా. మాంచి యూత్ ఫుల్ ప్రేమకథతో బెల్లంకొండ చిన్న కొడుకును తెరకు పరిచయం చేయబోతున్నాడు.

సావిత్రి సినిమా తరువాత పవన్ సాధినేని సరైన ప్రాజెక్టు కోసం చూస్తున్నారు. కళ్యాణ్ రామ్ కోసం ఓ మల్టీ స్టారర్ భారీ కథ తయారుచేసి, ఆ క్యాంప్ లోనే చాన్నాళ్లు వెయిట్ చేసారు. ఈ సినిమాలో హరికృష్ణకు కూడా కీలకపాత్ర తయారుచేసారు. కానీ ఆ తరువాత పరిస్థితులు అన్నీ మారిపోయి, ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు.

ఇలాంటి నేపథ్యంలో పవన్ సాధినేని చెప్పిన కథను బెల్లంకొండ సురేష్ ఓకె చేసి, తన చిన్న కొడుకును తెరకు పరిచయంచేసే బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు నిర్మాతగా సురేష్ నే వ్యవహరిస్తారు కానీ, పేరు ఎవరిది వుంటుందో చూడాలి.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments