కమలానికి మళ్లీ లొంగిన జనసేనాని?

"తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ-జనసేన దూకుడు పెంచాయి. ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే విషయంపై కసరత్తులు మొదలుపెట్టాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ దిశగా చర్చలు ప్రారంభించారు."

పవన్-వీర్రాజు భేటీపై ఈ రకంగా సాగుతున్నాయి కథనాలన్నీ. కానీ తాజా సమాచారం ప్రకారం జనసేనాని మరోసారి బీజేపీ ముందు మోకరిల్లడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైతే జెండా ఎత్తేశారో.. దాదాపు అదే పద్ధతిలో తిరుపతిలో కూడా ఆఖరి నిమిషంలో జనసేన జెండా ఎత్తేయడానికి పవన్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.

పవన్ ను ప్రత్యేకంగా కలిసిన సోము వీర్రాజు ఈ మేరకు బీజేపీ అభ్యర్థినే బరిలోకి దించాలనే అంశంపై పవన్ ను దాదాపుగా ఒప్పించినట్టు సమాచారం. 2024లో బీజేపీ-జనసేన సంయుక్తంగా అధికారంలోకి రావాలంటే ఇప్పుడు తిరుపతి సీటును జనసేన వదులుకోవాల్సిందేనంటూ సోము వీర్రాజు కొత్త లాజిక్ తీశారట.

అదేంటంటే.. ఏపీలో ఇప్పటివరకు బీజేపీ బోణీ కొట్టలేదు. ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలన్నా, రాష్ట్రంలో పరపతిని ఇంకాస్త పెంచుకోవాలన్నా.. బీజేపీ గెలుపు ఇప్పుడు అత్యావశ్యకమని సోము వీర్రాజు, పవన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తిరుపతి లాంటి సీటును బీజేపీ గెలిస్తే.. కేంద్రం పెద్దలను మరింత ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుందని, 2024కు అది మరింత లాభదాయకమవుతుందని వీర్రాజు వివరించినట్టు తెలుస్తోంది.  

ఈ మేరకు తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీకి అనుకూలంగా జరిగిన పరిణామాల్ని, తెలంగాణలో బీజేపీకి పెరిగిన ఆదరణను పూసగుచ్చినట్టు చెప్పారట.

తాజా భేటీతో పవన్ కల్యాణ్, మరోసారి త్యాగానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. లోకల్ పార్టీగా తను ఓ సీట సంపాదించే కంటే, జాతీయ పార్టీగా బీజేపీకి ఓ సీటు సంపాదించిపెడితే తన మైలేజీ, తన పార్టీ పరపతి మరింత పెరుగుతుందని పవన్ భావిస్తున్నారట. అయితే ఇప్పుడు జనసేనాని ముందు అతి పెద్ద సమస్య ఉంది.

బీజేపీ అభ్యర్థినే గెలిపించాలంటూ జనసైనికులకు పవన్ పిలుపునివ్వాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే పవన్ తర్జనభర్జన పడుతున్నారు. తమ సమాజిక వర్గం ఎక్కువగా ఉన్న తిరుపతి స్థానాన్ని బీజేపీకి వదిలేస్తే, జనసైనికులకు తప్పుడు సంకేతం ఇచ్చినట్టు అవుతుందని పవన్ భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికను కూడా వదులుకుంటే.. కార్యకర్తల్లో చీలిక వస్తుందేమోనన్న భయం కూడా పవన్ ను వెంటాడుతుంది.

అందుకే దశలవారీగా సైనికుల్ని మెంటల్లీ ప్రిపేర్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు పవన్. ఎవరు బరిలో దిగినా గెలిపించుకోవాల్సిన బాధ్యత జనసైనికులపై ఉందంటూ ఇప్పటికే బిస్కెట్ వేసిన పవన్ కల్యాణ్.. రాబోయే రోజుల్లో తన బుజ్జగింపుల పర్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. 

నువ్వు ఒడిపోతే పార్టీ మూసివేస్తావా !

దృతరాష్టుడి మాదిరిగా మారిపోతారేమో?

Show comments