జనసేనాని రాజకీయమంతా జగన్ కోసమేనా..?

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు. అదివారి సహజ లక్షణం. ఇప్పుడీ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా ఉంటే.. పవన్ కి మాత్రం ఆ సంతోషం కనపడ్డంలేదు.

తాజాగా జనసేన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ పెట్టించారు పవన్ కల్యాణ్. సీపీఎస్ రద్దుపై జగన్ కమిటీ వేస్తున్నారట, గతంలో కమిటీలతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నట్టే ఇప్పుడు జగన్ కూడా కమిటీలు వేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచారని దెప్పిపొడిచారు. దొందూ దొందేనంటూ బాబు, జగన్ ఫొటోల్ని వదిలారు. అయితే ఈ ఫ్రస్టేషన్ ఇక్కడిది కాదు, ఇటీవల బాబు బినామీ పవన్ అంటూ వైసీపీ ర్యాగింగ్ చేయడంతో ఆయనకు రోషం పొడుచుకొచ్చింది. నేను బినామీనా అంటూ అంతెత్తున ఎగిరిన పవన్.. బాబుని పద్ధతిగా నాలుగు తిడితేపోలా.. అనుకున్నారు. అందుకే కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేయకుండా పక్కన చంద్రబాబు ఫొటో కూడా తగిలించి ట్వీట్ వదిలారు.

పవన్ కి అర్థంకాని విషయం, ఆయన అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే.. జగన్ కమిటీలతో కాలయాపన చేసేరకం కాదు. ఆర్టీసీ విలీనంపై కూడా జగన్ కమిటీ వేశారు. ఏమైంది? రోజుల వ్యవధిలోనే కమిటీ నివేదిక ఇచ్చింది. విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇప్పుడు సీపీఎస్ రద్దుకు కమిటీ అంటున్నారు. జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో.. ఆయా ఉద్యోగులకు బాగాతెలుసు. అందుకే వారంతా సైలెంట్ గానే ఉన్నారు, పవన్ కల్యాణ్ మాత్రమే నోరు చేసుకుంటున్నారు.

ఆర్టీసీ విలీనంపై నోరు మెదపని పవన్ కల్యాణ్ ఇప్పుడు సీపీఎస్ రద్దు కమిటీపై ఎలా కామెంట్ చేస్తారు. జగన్ ని విమర్శించడం కోసమే రాజకీయాలు చేస్తున్నారా? లేదా జనం కోసమా? అనేది పవన్ గ్రహిస్తే బాగుంటుంది.

నీ సినిమా గురించి అడిగి కడిగి పారేస్తా.. హీరో