పవన్ మూడు నెలలు రాజకీయాలపైనే?

సీరియస్ రాజకీయాలు చేయడం లేదు. ట్విట్లు తప్ప వేరు లేదు అని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పై విమర్శ వినిపిస్తూ వుంటుంది. ఎన్నికలు ఏడాది దూరంలో వున్నాయన్న వార్తలూ వినిపిస్తున్నాయి. అసలు 2019ఎన్నికల్లో జనసేన సీరియస్ గా పోటీ చేస్తుందా? ఎప్పటి లాగే చంద్రబాబు ఎక్కిన పల్లకీ మోయడానికే పరిమితం అవుతుందా? అన్న అనుమానాలు వుండనే వున్నాయి. అయితే పవన్ మాత్రం పార్టీ నిర్మాణంపై సీరియస్ గా వున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే పార్టీ కార్యాలయ పనులు చరుగ్గా సాగుతున్న ఫొటోలు కూడా మీడియాకు పంపించారు.

అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం చేస్తున్న అజ్ఞాతవాసి సినిమావర్క్ పూర్తి కాగానే మూడు నెలల పాటు పవన్ కళ్యాణ్ పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వాలు, సభ్యుల డేటా బేస్, జిల్లాల వారీ కీలక వ్యక్తులు, ఇలా అన్నీ సమీకరించడం, పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పక్కాగా వ్యవస్థీకృతం చేయడం వంటి పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారని వార్తలు వినవస్తన్నాయి.

పవన్ కు ప్రస్తుతం ఇమ్మీడియట్ కమిట్ మెంట్ ఒక్కటే వుంది. సంతోష్ శ్రీనివాస్-మైత్రీ మూవీస్ కాంబినేషన్ లో తెరి రీమేక్ చేయడం. అయితే ఈ సినిమా చేయడం, చేయకపోవడం అన్నది ఎన్నికల షెడ్యూలు మీద ఆధారపడి వుంటుందని తెలుస్తోంది. ఎన్నికలు 2018 అక్టోబర్ లో పక్కా అని అంటే కనుక, ఈ సినిమా వుండకపోచవ్చు. ఎన్నికలకు కనీసం మూడు నాలుగు నెలల ముందు నుంచే కసరత్తు మొదలవుతుంది. అందువల్ల ఈ సినిమా చేయడానికి పవన్ కు అంత టైమ్ చిక్కకపోవచ్చు.

అయితే జనవరి నుంచి నాలుగు నెల్లలో తమ సినిమా ఫినిష్ చేసేయవచ్చు అనే ఆలోచనలో సంతోష్ శ్రీనివాస్-మైత్రీ మూవీస్ వున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి డేట్ లు ఇస్తానని పవన్ భరోసా ఇచ్చారని అంటున్నారు. కానీ ఎంత వరకు పాజిబుల్ అన్నది అనుమానమే. 2016 అక్టోబర్ నుంచి హారిక హాసినికి డేట్లు ఇస్తానని చెప్పిన పవన్ అప్పటికి ఆరు నెలల తరువాత ఇచ్చారు. ఇప్పటికి సినిమా ఫినిష్ కాలేదు.

Readmore!

అందువల్ల 2018 అక్టోబర్ ఎన్నికలు అంటే మాత్రం అజ్ఞాతవాసి తరువాత పవన్ సినిమాలకు ఓ ఏడాది గ్యాప్ తప్పకపోవచ్చు.

భాజపా? వామపక్షాలు?

భాజపాను వామపక్షాలను చంద్రబాబు-పవన్ కళ్యాణ్ పంచుకునే ఆలోచనలు సాగుతన్నట్లు తెలుస్తోంది. భాజపా-వామపక్షాలు రెండూ కలవని వ్యవహారాలు కాబట్టి, వీళ్లను ఈ ఇద్దరు పంచుకుని, వేరు వేరుగా ఎన్నికల్లో పోటీ చేసి, ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకునే ఆలోచనలు సాగుతున్నాయని, తద్వారా వైకాపాను నిలవరించాలన్న చంద్రబాబు ప్రణాళికకు అనుగుణంగా పవన్ తన రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటున్నారని, అదే సమయంలో కాపు ఓటు తెలుగుదేశం నుంచి వైకాపాకు వెళ్లకుండా పవన్ దారి మళ్లిస్తారని పథకాలు రచిస్తున్నారని వినికిడి.

Show comments