పవన్ కు 33 కోట్ల అప్పులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమాకు పదిహేను నుంచి ఇరవై కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్న స్టార్ హీరో. అలాంటి హీరో ఇప్పటికి ఎంత సంపాదించి వుండొచ్చు. హైదరాబాద్ లో ఇల్లు, ఫారమ్, అలాగే గుంటూరులో ఇల్లు.. ఇంకా.. ఇంకా.. వీటి సంగతి ఏమో కానీ, అప్పులు మాత్రం అక్షరాలా 33 కోట్లకు పైమాటే.

పవన్ కళ్యాణ్ ఎన్నికల నామినేషన్ వేళ సమర్పించిన అఫిడవిట్ సాక్షిగా ఆయన వివిధ సంస్థలు వ్యక్తుల దగ్గర తీసుకున్న అప్పులు లేదా అడ్వాన్స్ లు ఇవి.

పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన అప్పు...2 కోట్ల 40 లక్షలు

హారిక హాసిని సంస్థ ఇచ్చిన అడ్వాన్స్....ఒక కోటి పాతిక లక్షలు

వదినగారు కొణిదెల సురేఖ వద్ద తీసుకున్న పర్సనల్ లోన్.... కోటి ఏడు లక్షలకు పైగా..

ఎమ్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిన పర్సనల్ లోన్... అక్షరాలా మూడు కోట్లు

ఎమ్వీఆర్ఎస్ ప్రసాద్  ఇచ్చిన పర్సనల్ లోన్ రెండుకోట్లు

బాలాజీ సిని మీడియా సంస్థ ఇచ్చినది రెండు కోట్లు

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇచ్చినది 27 లక్షలకు కాస్త అటుగా.

మైత్రీమూవీస్ వై నవీన్ కుమార్ ఇచ్చిన లోన్ అయిదు కోట్ల యాభైలక్షలు.

ఇవికాక ఇంకా వేరే బకాయిలు.. మూడు కోట్లు అరవై లక్షలకు పైగా

వెరసి మొత్తం అప్పులు లేదా జనాల డబ్బులు పవన్ పై వున్నది 33 కోట్ల 72 లక్షల 65 వేల 361. మరి ఇవన్నీ ఎప్పుడు ఎలా తీరుస్తారో?

సినిమాలు చేస్తేనే ఆయనకు ఆదాయం వస్తుంది. కనీసం రెండు సినిమాలు చేస్తే ఈ అప్పులు అన్నీ తుళ్లిపోతాయి. చేస్తారేమో? లేదా ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత తీర్చేస్తారేమో?

Show comments