ఓహో.. సంస్కారం అంటే ఇదేనా పవన్!

సంస్కారం గురించి తరచూ మాట్లాడుతూ ఉంటాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. తను ఎవరిని ఏమీ అనను అని.. అందరితోనూ చాలా సంస్కార పూరితంగా ప్రవర్తిస్తానని.. పవన్ చెబుతూ ఉంటాడు. రాజకీయాల్లో విమర్శలు మామూలేనని..అలాగని తను కుసంస్కారపూరితమైన మాటలు మాట్లాడను అని పీకే సెలవిస్తూ ఉంటాడు.

అలా సంస్కారం గురించి చాలా సంస్కారపూరితంగా లెక్చర్లు ఇచ్చే సంస్కారవంతుడు పవన్ కల్యాణ్.. మరోసారి తన సంస్కారం గురించి చాలా సంస్కారవంతంగా చాటి చెప్పుకున్నాడు. ఈసారి జగన్ ‘మగతనం” గురించి పవన్ ప్రశ్నించాడు. జగన్ తన ‘మగతనాన్ని” నిరూపించుకోవాలని పవన్ సవాల్ విసిరాడు.

సందర్భం ఏదైనా.. ఏ విషయంలో ఈ సవాల్ విసిరినా.. పవన్ కల్యాణ్ తన సంస్కారాన్ని ఇలా చాటుకున్నాడు. ఇందుమూలంగా యావన్మందీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. పవన్ కల్యాణ్ సంస్కారం ఇది. తను చాలా సంస్కార వంతుడిని అని.. తన తల్లి తనకు సంస్కారం నేర్పిందని కూడా ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సెలవివ్వవడం కొసమెరుపు. ఇదేనన్నమాట అది!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్  

Show comments