పవన్ ఇరవై నిమిషాల వరకు కనిపించరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓకె చేసారు. సుజిత్ దర్శకుడు. డివివి దానయ్య నిర్మాత. క్రిష్ సినిమాతో కిందా మీదా అవుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఎలా ఓకె చేసి వుంటారు అన్నది క్వశ్చను. 

ఈ క్వశ్చనుకు ఆన్సర్ తెలియాలంటే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు గుర్తు తెచ్చుకోవాలి. వాటిల్లో పవన్ పాత్ర మొత్తం పక్కకు తీసి పెట్టి, లెంగ్త్ కాలుక్యులేట్ చేస్తే అసలు సంగతి తెలుస్తోంది. సినిమా మొత్తం కనిపిస్తుంటారు కానీ టోటల్ గా చూసుకుంటే ఆయన పాత్ర లెంగ్త్ తక్కువే వుంటుంది. కానీ హరిహర వీర మల్లు అలా కాదు. ఫుల్ లెంగ్త్ హీరో క్యారెక్టర్.

ఇదిలా వుంటే సముద్రఖని డైరక్షన్ లో సినిమా ఓకె చేసారు పవన్. జస్ట్ ముఫై రోజుల షూట్ వుండే పాత్ర అని వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు సుజిత్ సినిమా కూడా ఇదే మాదిరి అని తెలుస్తోంది. సినిమా మొత్తం పవన్ కనిపిస్తారు. కానీ పవన్ వర్క్ తక్కువ అని టాక్. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల వరకు పవన్ స్క్రీన్ మీదకు రారు అని గ్యాసిప్ వినిపిస్తోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని, సినిమా అంతా పవన్ మీదే వుంటుంది కానీ ఆయన పాత్ర నిడివి తక్కువ అని వినిపిస్తోంది.

అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏమిటంటే పవన్ కు సూక్ష్మంలో మోక్షం ఇచ్చే పాత్రలు కావాలన్నమాట. తక్కువ టైమ్ లో, తక్కువ కష్టంతో ఫుల్ లెంగ్త్ రెమ్యూనిరేషన్ అన్నమాట. పాపం ఈ సూక్ష్మం తెలియకే హరీష్ శంకర్ తన కథతో పవన్ ను ఒప్పించలేకపోతున్నారేమో?

Show comments