లెక్చరర్ గా మారిన పవన్.. జనసైనికుల్లో నీరసం

పవన్ కల్యాణ్ ధాటికి, వాగ్ధాటికి జనసైనికులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ లెక్చర్లేంటి బాబోయ్ అంటూ హడలిపోతున్నారు. జనవరి 3 నుంచి ఏకధాటిగా జరుగుతున్న జిల్లా మీటింగులతో జనసైనికుల తల బొప్పికట్టింది. త్యాగాలు చేయండి, పార్టీ కోసం పనిచేయండి, పాతికేళ్లు కష్టపడండి... అంటూ వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా పవన్ కల్యాణ్ క్లాస్ పీకుతుంటే కనీసం కుర్చీల్లోంచి కదిలే సదుపాయం కూడా లేకుండా అలానే ఊపిరి బిగపట్టి వినడం మినహా ఏం చేయలేకపోతున్నారు కార్యకర్తలు.

పార్టీ మీటింగ్ అంటే కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటారు, స్థానిక రాజకీయాలపై ఆరాతీస్తారు. అవసరమైతే నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థిని నిర్ణయిస్తారు. కానీ పవన్ కల్యాణ్ ది అంతా వన్ సైడ్ గేమ్. కార్యకర్తల నుంచి తెలుసుకుంది తక్కవ, వారికి ఉపదేశం చేసింది ఎక్కువ. బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ మాట్లాడింది 1 పర్సెంట్ అయితే, నాలుగు గోడల మధ్య పవన్ తన పురాణాన్ని 100 పర్సెంట్ వినిపిస్తున్నారు.

అందుకే జిల్లాల నుంచి వచ్చిన జనసైనికులు పవన్ స్పీచ్ లకు ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో అర్థంకాక అలా బొమ్మల్లా ఉండిపోతున్నారు. పవన్ కల్యాణ్ రోజుకి 8 గంటలు పుస్తకాలు మాత్రమే చదువుతానని చెబుతుంటే నమ్మలేదని, గదిలో పెట్టి ఇలా లెక్చర్లు దంచేసరికి అది నిజమని నమ్మాల్సి వచ్చిందని అంటున్నారు సైనికులు.

పవన్ కల్యాణ్ లో ఓ గొప్ప లెక్చరర్ ఉన్నాడని జనసేన కార్యకర్తలే సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అయితే కమిటీలు సిద్ధమవుతున్న తరుణంలో.. పవన్ చెబుతున్న మాటలకు తలాడించడం తప్పితే కనీసం చర్చ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.

పైగా ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరట జనసేనాని. తను చెప్పాల్సింది చెప్పేసి పంపించేస్తున్నారట. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో, కనీసం కమిటీ సమన్వయకర్త ఎవరో తెలుసుకుందామని ఆశగా వచ్చిన జనసైనికులకు తీవ్ర అసంతృప్తి మిగులుతోంది.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు

Show comments