పవన్.. అడ్వాన్స్ లు ఎందుకోసం?

వందల కోట్ల ఆదాయం సినిమాల్లో వదులుకుని రాజకీయాల్లోకి ప్రజాసేవ కోసం వచ్చానని తరచు చెబుతుంటారు పవన్ కళ్యాణ్. ఇక సినిమాలు చేయనని ఆయన గతంలో చెప్పేసారు కూడా. అయినా ఫ్యాన్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఆయన సినిమాల్లోకి మళ్లీ వస్తారని నమ్ముతూనే వున్నారు. కానీ పవన్ ఇప్పుడు పీకల్లోతుగా రాజకీయాల్లో మునిగివున్నారు. అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఆంధ్ర రాజకీయాల్లో బిజీ అవుతారు.

మరి అలాంటపుడు మళ్లీ సినిమాలు చేసే చాన్స్ చాలా తక్కువ. పైగా పవన్ వయస్సు యాభైకి చేరువ అవుతోంది. ఇప్పుడు ఆడియన్స్ మిడ్ ఏజ్డ్ వయస్సు హీరోలను అంతగా చూడడంలేదు. యంగ్ బ్యాచ్ దే హవా. ఇలాంటి టైమ్ లో పవన్ ఎన్ని సినిమాలు చేయగలరు? అసలు చేస్తారా? అన్నది సమస్య.

మరి ఈ విషయంలో పవన్ కు కొంతయినా క్లారిటీ వుండొచ్చు. కానీ ఆయన అన్ని కోట్ల అడ్వాన్స్ లు దగ్గర ఎందుకు వుంచుకున్నారన్నది పాయంట్. మైత్రీ వాళ్ల అయిదున్నరకోట్లు, హారిక హాసిని, వెంకటేశ్వర సినీచిత్ర ఇలా చాలామంది అడ్వాన్స్ లు ఆయన దగ్గర వున్నాయి. ఒక విధంగా ఇవన్నీ వడ్డీలేని అప్పులే. ఏ నిర్మాత అడ్వాన్స్ కు హీరోలు వడ్డీలు ఇచ్చిన దాఖలాలు చాలా అంటే చాలాతక్కువ.

మరి సినిమాలు చేయనని తెలిసి, జనం డబ్బులు వడ్డీలు లేకుండా దగ్గర వుంచుకోవడం ఏ మేరకు నైతికత అవుతుంది? యాభైకోట్ల పైచిలుకు ఆస్తులు వున్న పవన్ 30 కోట్ల పైచిలుకు అడ్వాన్స్ లు వెనక్కు ఇవ్వాలంటే ఏం చేస్తారు? పైగా ఆయనకు ఇప్పుడు ఆదాయం కూడా లేదు.

ఆస్తులు అమ్మే వెనక్కు ఇవ్వాలి లేదా సినిమాలు చేయాలి. ఈ విషయంలో పవన్ నిర్ణయం తెలిసేవరకు నిర్మాతల డబ్బులు అలా పవన్ దగ్గర పడి వుండాల్సిందే.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా 

Show comments