పరుశురామ్ ఇప్పుడు ప్రభాస్ కోసం

తను తయారు చేసిన కథ పట్టుకుని, ఎవరు చేస్తారా? అని ఎదురు చూస్తున్నాడు దర్శకుడు పరుశురామ్. బ్లాక్ బస్టర్ గీతగోవిందం వచ్చి ఏడాదిన్నర అయిపోయింది. ఇప్పటి వరకు కలిసే హీరో, చెప్పే నెరేషన్ అవుతోంది కానీ సినిమా సెట్ కావడం లేదు.

మహేష్ కథ సూపర్, చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నా అన్నాడు కానీ ఓకె అనలేదు. అఖిల్ రెడీనే కానీ అతనికి తగ్గ స్క్రిప్ట్ కాదు. మరెవరు రెడీగా లేరు. ఆఖరికి ఇప్పుడు యువి క్రియేషన్స్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. తన ఆప్తుడు బన్నీ వాస్ ద్వారా, అతని స్నేహితుడు యువి వంశీకి కబురు వెళ్లినట్లు, ప్రభాస్ కు స్క్రిప్ట్ నెరేట్ చేయడానికి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది.

నేడో, రేపో పరుశురామ్ మరోసారి తన కథను మరో హీరోకి వినిపించబోతారన్నమాట. ప్రభాస్ ప్రస్తుతానికి ఏ సినిమా చేయడం లేదు. కొంతవరకు షూట్ చేసిన జాను సినిమానే ఫినిష్ చేయాల్సి వుంది. దానికి కూడా బాగా టైమ్ వుంది.

దాని తరువాత చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ లాంటి టాప్ డైరక్టర్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో పరుశురామ్ కు ఎంతవరకు అవకాశం వుంటుందో చూడాలి.

పంచాయతీలలో చంద్రబాబు నిష్ణాతుడే

Show comments

Related Stories :