మరోమారు బట్టబయలైన ‘పప్పు’ జ్ఞానం!

తాము ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఆ వ్యవహారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లాక్కువచ్చి... ఏదో ఒక రీతిగా ఆయన మీద కాస్త బురద చల్లితే తప్ప.. తెలుగుదేశంలోని కొందరు నాయకులకు బహుశా నిద్ర కూడా పట్టదేమో. జగన్ కూడా తక్కువేమీ కాదు. అదే తరహాలో అధికారపక్షాన్ని ప్రతినిత్యమూ తూర్పారపట్టేస్తుంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఎవరు అర్థవంతమైన విమర్శలు చేస్తున్నారు... ఎవరు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు..? అనేది! అర్థంలేని విమర్శలతో బురద చల్లే ప్రయత్నం చేస్తే.. మన అజ్ఞానం బయటపడుతుందే తప్ప.. ఇతరత్రా లాభముండదు. ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్ ను కార్నర్ చేయడానికి, పప్పుగా ప్రత్యర్థులు వ్యవహరిస్తూండే నారా లోకేష్ తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తన పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఓ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో కూడా ముందుగా ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని, ఒకటిరెండు నెలలు ముందగా ఎన్నికలొస్తాయని.. ఆలోగా మన పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దృష్ట్యా, ముందుగా వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని చెప్పడం ఎవరికైనా సహజం.

అయితే మంత్రి నారాలోకేష్ మాత్రం ఈ అంశాన్ని కూడా జగన్ ను దెప్పిపొడవడానికి వాడుకుంటున్నారు. వాడుకుంటే.. ఓకే. పనిలో పనిగా తన అజ్ఞానాన్ని మరోమారు బయటపెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ముందుకు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ సన్నద్ధత కోసం చెప్పినమాట. నిజానికి చంద్రబాబునాయుడు ప్రతిసారీ ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి’ అని చెబుతూ ఉంటారు. అంటే- చంద్రబాబు చెబితే అది హితోపదేశం, జగన్ చెబితే అది తప్పు అన్నట్టుగా లోకేష్ అభివర్ణిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియని విషయాలు జగన్ కు తెలుస్తున్నాయని, భాజపా నాయకుల ద్వారా ఆయనకు హాట్ లైన్ లో తెలుస్తున్నాయేమోనని లోకేష్ ఎద్దేవా చేశారు. అయినా రాష్ట్రంలో ముందస్తు వచ్చేట్లయితే అది భాజపా నాయకులకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ కేంద్రంలోని భాజపా ముందస్తుకు వెళ్లేట్లయితే ఆ సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఇలా మరోమారు లాజిక్ లేకుండా, మాట్లాడి తన పప్పు వైఖరిని చాటుకుంటున్నారని ప్రజలు అంటున్నారు.