'పందెంకోడి 2' పార్ట్ వన్ ను మించి- ఠాగోర్ మధు

మాస్‌ హీరోగా విశాల్‌ కథానాయకుడిగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పందెంకోడి 2'. లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఠాగూర్‌ మధు మీడియాతో మాట్లాడారు. 

ఇది సీక్వేలా? లేక కేవలం టైటిల్.. కొన్ని పాత్రలు వాడారా?
ఇది పర్‌ఫెక్ట్‌ సీక్వెల్‌. మొదటి భాగంలోని క్యారెక్టర్స్‌ ఆధారంగానే ఈ సినిమా ట్రీట్‌మెంట్‌ రాయడం జరిగింది. పందెంకోడిలోని ఎమోషన్‌ ఈ సినిమాలో కూడా క్యారీ అవుతుంది.

ఈ సినిమాని మీరు తీసుకోవడం వెనుక ప్రత్యేకమైన రీజన్‌ ఉందా?
నేను 'పందెంకోడి' సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ఆ సినిమాలోని హీరో క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది. పైగా పక్కా మన సీమ నేటివిటీకి దగ్గరగా వుంటుంది. అటు ఫ్యామిలీ ఎమోషన్లు, ఇటు యాక్షన్ సీన్లు పెర్ ఫెక్ట్ గా మిక్స్ చేసిన సినిమా అది. రెండో పార్ట్ కూడా అచ్చం అలాగే వుంటుంది. ఇటు ఫన్, అటు యాక్షన్, మరో వైపు ఫ్యామిలీ సీన్లు అన్నీ పక్కాగా కలిసాయి. అందుకే తీసుకున్నాను.

లింగుస్వామి మళ్లీ పామ్ లోకి వస్తారా?
'పందెంకోడి' సినిమా కంటే 'పందెంకోడి 2'ని లింగుస్వామిగారు బాగా డీల్‌ చేశారు. అతని కెరీర్‌లో ఈ సినిమాకి ది బెస్ట్‌ అనిపించేంతగా వర్క్‌ చేశారు. ప్రతి క్యారెక్టర్‌ని చాలా డెప్త్‌గా డిజైన్‌ చేశారు. ఫామ్ లోకి రావడం కాదు, లింగుస్వామి ఫుల్ ఫామ్ లో వున్నారు.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది?
'పందెంకోడి' సినిమా విశాల్‌కి చాలా ఎమోషనల్‌ ఫిల్మ్‌. పర్సనల్‌గా చాలా బాగా కనెక్ట్‌ అయిన ఫిల్మ్‌. సీక్వెల్‌ స్టార్ట్‌ అవ్వకముందు నుంచే ఈ సినిమాపై తనకి ఒక ప్రత్యేకమైన ఇంట్రస్ట్‌ ఉంది. అందుకే మనసు పెట్టి ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. హీరోయిన్‌గా కీర్తిసురేష్‌ కూడా చాలా బాగా చేసింది. తన క్యారెక్టర్‌ కూడా డైరెక్టర్‌ చాలా బాగా డిజైన్‌ చేశారు. ఎవ్వరికీ భయపడకుండా, ఎప్పుడూ అల్లరి చేసే అమ్మాయి. తను చేసే పనులు, చెప్పే సమాధానాలు కూడా ఆసక్తి కలిగించేలా ఉంటాయి.

లేడీ విలన్ గా వరలక్ష్మి ఎలా చేసారు?
ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. తను ఈ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసింది. తెలుగు అర్ధం చేసుకొని మరీ తన పాత్రకి తానే డబ్బింగ్‌ చెప్పుకుంది. అప్పటికే మేము చాలామంది డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లను ట్రై చేశాము. ఎవరు చెప్పినా ఆ పాత్ర తాలూకు గాంభీర్యం, ఎమోషన్‌ రావట్లేదు. చివరకి తను డబ్బింగ్‌ చెప్పాక ఆ పాత్ర సినిమాలో బాగా ఎలివేట్‌ అయింది.

'పందెంకోడి 2' చూశారా? మీకేమనిపించింది?
మొన్నే మా టీమ్‌తో కలిసి చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా 'పందెంకోడి 2'. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

Show comments