పండక్కి బాబాయ్ కాదు అబ్బాయే

సంక్రాంతి అంటే బాలయ్య సినిమా పక్కా అన్నది చాలా కాలంగా వస్తున్న ఆనవాయతీ. కానీ ఈసారి ఆ సెంటిమెంట్ వుండేలా కనిపించడం లేదు. ముందుగా డిసెంబర్ లోనే కెఎస్ రవికుమార్ తో బాలయ్య చేసే సినిమా విడుదలవుతుందని టాక్ వుంది. ఇది నిజమే అనిపించేలా ఓ అనౌన్స్ మెంట్ ఇప్పుడు బయటకు వచ్చింది.

నందమూరి కళ్యాణ్ రామ్-సతీష్ వేగ్నిశ కాంబినేషన్ లో తయారవుతున్న 'ఎంత మంచి వాడవురా' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది. సంక్రాంతికి మహేష్ బాబు, బన్నీ సినిమాలు వున్నాయని తెలిసీ ఈ సినిమా ప్రకటన ఇచ్చారు అంటే, మేకర్ల ధీమా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో బాలయ్య సినిమా వుంటుందో, వుండదో తెలియకుండా ఈ ప్రకటన అయితే ఇవ్వరు.

బాబాయ్ సినిమా లేదు అని కన్ ఫర్మ్ చేసుకున్నాకే ఈ ప్రకటన ఇచ్చి వుంటారు. మొత్తానికి సంక్రాంతికి ఎవరో ఒకరు, నందమూరి హీరోల సినిమా అయితే వస్తోంది. అయితే డేట్ మాత్రం వెల్లడించలేదు. 10,11,12 మూడు తేదీల్లో మహేష్, బన్నీ, కళ్యాణ్ రామ్ ఎవరు ఏ డేట్ తీసుకుంటారో చూడాలి.

సాహోపై అంచనాలు ఏ స్థాయిలో వున్నాయంటే..

Show comments