పక్కా రొటీన్ 'గుణ'

కుర్ర హీరోలంతా వైవిధ్యమైన కథలు ఎక్కడ దొరుకుతాయా? అని చూస్తుంటే యంగ్ హీరో కార్తికేయ మాత్రం మళ్లీ ఓ రొటీన్ ఫిల్మ్ నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఆర్ ఎక్స్ 100తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ, తరువాత హిప్పీ అనే సినిమా ట్రయ్ చేసాడు. కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా గుణ 369 అనే డిఫరెంట్ టైటిల్ తో సినిమా రెడీ చేసాడు. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.

కానీ టైటిల్ కు వున్న వైవిధ్యం మాత్రం ట్రయిలర్ లో అంతగా కనిపించలేదు. ఫ్యామిలీ, ప్రేమ, విలన్, కాపాడుకోవడం వంటి రొటీన్ లైన్ నే ట్రయిలర్ లో కనిపిస్తోంది. దానికి తగినట్లే సీన్లు ట్రయిలర్ లో పరుచుకున్నాయి. హాయిగా సాగిపోయే లైఫ్, ప్రేమ, అంతలో అనుకోని పరిణామాలు, ఆ పైన యాక్షన్ టర్న్ తీసుకునే సినిమా ఈ లైన్ లోనే కట్ చేసారు ట్రయిలర్ ను.

కార్తికేయ రెగ్యులర్ సీన్ల కన్నా, యాక్షన్ సీన్లలో బాగా రాణించినట్లు కనిపిస్తోంది. యంగ్ హీరో నటించిన ఈ రొటీన్ యాక్షన్ పిక్ ను జనం వచ్చేనెల 2న చూడబోతున్నారు. అర్జున్ జంధ్యాల తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మించారు.

మళ్ళీ ఆత్మగౌరవం నినాదం.. మారానని ప్రచారం