ఈ ఇండియ‌న్ హీరోయిన్ కు పాక్ లో అంత క్రేజ్!

గ‌త ఆరు నెల‌ల్లో పాకిస్తాన్ లో గూగుల్ సెర్చ్ లో బాగా వెత‌క‌బ‌డిన ప్ర‌ముఖుల జాబితాలో టాప్ సిక్స్త్ ప్లేస్ లో నిలిచింద‌ట సారా అలీ ఖాన్. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ కూతురుగా గుర్తింపుకు నోచుకున్న సారా కొన్ని సినిమాల్లో కూడా న‌టించింది. హీరోయిన్ గా అలా ప్ర‌యాణం సాగిస్తున్న ఈమెపై మీడియా క‌ళ్లు ఎప్పుడూ ఉంటాయి.

అమృతాసింగ్ కూతురుగా కూడా సారా పై చ‌ర్చ సాగుతూ ఉంటుంది. త‌ల్లిదండ్రులు విడిపోయినా.. ఇద్ద‌రితోనూ వేర్వేరుగా క‌నిపిస్తూ, గుళ్ల ద‌గ్గ‌ర చాలా సంప్ర‌దాయ బ‌ద్ధంగా క‌నిపిస్తూ ఉంటుంది సారా. త‌ను క‌నిపిస్తే చాలు కెమెరాలు క్లిక్ మ‌నిపించే మీడియా వాళ్ల‌తో కూడా 'భ‌య్యా..' అంటూ మాట్లాడుతూ.. వీడియోల్లో అగుపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్రెండ్లీ నేచ‌ర్ తో  క‌నిపించే సారా అభిమానుల మ‌నసుల‌ను కొల్ల‌గొడుతూ ఉంది.

కేవ‌లం ఇండియా కే ఈమె క్రేజ్ ప‌రిమితం కావ‌డం లేదు. పాకిస్తాన్లో కూడా సారా కు బోలెడంత ఫాలోయింగ్ ఉంద‌ని స్ప‌ష్టం అవుతోంది. గూగుల్ సెర్చింగ్ లో ఈమె పాకిస్తాన్ లో టాప్ లో నిలుస్తూ ఉంది. టాప్ సిక్స్ లో ఉంది. ఈమెతో పాటు మ‌రిన్ని భార‌తీయ ఎంట‌ర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ప‌ట్ల కూడా పాక్ లో విప‌రీత ఆస‌క్తి వ్య‌క్త‌మైంద‌ట‌. హిందీ బిగ్ బాస్ సీజ‌న్ 13, చిన్న‌పిల్లల కార్టూన్ ప్రోగ్రామ్'మోటూ ప‌ట్లూ' గురించి కూడా పాక్ లో విప‌రీతంగా గూగుల్ సెర్చ్ అయిన‌ట్టుగా తెలుస్తోంది!

Show comments