పదవులు ప్రకటించిన చంద్రబాబు..!

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.

శాసన సభ, మండలిలో ప్రతిపక్ష పదవులను ఆయన ప్రకటించారు. అసెంబ్లీలో టీడీఎల్పీ నేతలుగా చంద్రబాబు ఇదివరకే ఎన్నికైన సంగతి తెలిసిందే. 

ఇక అసెంబ్లీలో ఉపనేతగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య నాయుడు, రామానాయుడుని, విప్‌గా బాల వీరాంజనేస్వామిని నియమించారు. 

శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉప నేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌, సంధ్యారాణి, గౌరువాని శ్రీనివాసులు, విప్‌గా బుద్ధా వెంకన్న, టీడీఎల్పీ ట్రెజరర్‌గా మద్దాలి గిరిని నియమించారు.