'ఒంగోలుగిత్త'తో అఖిల్ ఫిక్స్

ఎట్ లాస్ట్...అక్కినేని అఖిల్ నాలుగో సినిమా కన్ ఫర్మ్ అయింది. తన కొడుకుకు ఓ హిట్ ఇవ్వమని నాగార్జున కొడుకును అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. దిల్ రాజు, సురేష్ మూవీస్, కన్నడ సినిమా రంగం ఇలా అన్ని చోట్లా తిరిగి, తిరిగి ఆఖరికి గీతా సంస్థలో సెటిల్ అయిన బొమ్మరిల్లు, ఒంగోలు గిత్త సినిమాల దర్శకుడు భాస్కర్ డైరక్షన్ లో అఖిల్ సినిమా పక్కా అయింది.

ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సాగే కథను నాగార్జున కూడా విని ఫైనల్ చేయడంతో సినిమా పక్కా అయింది. గోపీసుందర్ సంగీతం అందిస్తారు. అందంతో పాటు కాస్త టాలెంట్ వున్న హీరోయిన్ అవసరం ఈ సినిమాకు. ఎందుకంటే హీరో తో పాటు హీరోయిన్ రోల్ కూడా కీలకమే. రష్మిక మడోన్నా కాదు కానీ, ఆ టైపు హీరోయిన్ కావాలంట. 

అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీవాస్ నిర్మించే ఈ సినిమాతో చాన్నాళ్ల తరువాత బొమ్మరిల్లు భాస్కర్ మెగా ఫోన్ పట్టబోతున్నారన్నమాట. వివి వినాయక్, విక్రమ్ కుమార్ లాంటి టాప్ డైరక్టర్లు, వెంకీ అట్లూరి లాంటి యంగ్ డైరక్టర్ తో అఖిల్ తన అదృష్టం పరీక్షించాడు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ తో ఎలా వుంటుందో చూడాలి.

ఈ సినిమా కథ మీద అల్లు అరవింద్ చాలా నమ్మకంతో వున్నారు. నాగ్ కు కూడా ఈ కథ బీభత్సంగా నచ్చేసిందట. మరి ఫలితం పాజిటివ్ గా వుంటుందనే ఆశిద్దాం.