ఓ బేబీ ప్రీ రిలీజ్ బిజినెస్

ఈ మధ్యకాలంలో సినిమాలకు బిజినెస్ లు కష్ఠం అవుతుందో. పది సినిమాలు విడుదలయితే సగం సినిమాలు బిజినెస్ కాకుండానే స్ట్రయిట్ రిలీజ్ చేసుకుంటున్నాయి.. ఇలాంటి నేపథ్యంలో ప్రొడక్షన్ కాస్ట్ అంతా రాబట్టేసుకుని, థియేటర్ హక్కులు దగ్గరే వుంచుకుని, స్ట్రయిట్ రిలీజ్ చేసుకోవడం అంటే అదృష్టమే.

ఆ అదృష్టం పేరు ఓ బేబీ. మూడు నిర్మాణ సంస్థలు కలిసి సమంత కీలకపాత్రలో నిర్మించిన ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 13 కోట్లు. ఆంధ్ర, నైజాం థియేటర్ హక్కులు చేతిలో వుండగానే ఆ 13 కోట్లు దాదాపు రికవరీ అయిపోవడం విశేషం.

ఓవర్ సీస్ రైట్స్ ద్వారా 1.75 కోట్లు, కర్ణాటక హక్కులు 75 లక్షలు, నెట్ ఫ్లిక్స్ ద్వారా 3 కోట్లు, శాటిలైట్ ద్వారా 2 కోట్లు వచ్చాయి. అలాగే హిందీ డబ్బింగ్ కు కూడా మూడుకోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అంటే దాదాపు 11 కోట్ల వరకు రికవరీ అయిపోయింది.

సినిమాలో సురేష్ బాబు భాగస్వామి కాబట్టి, ఆయన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేరుగా విడుదల చేస్తున్నారు. మిగిలిన ఇధ్దరు భాగస్వాములు టివి విశ్వప్రసాద్, సునీత్ దానికి ఓకె అన్నారు. సినిమా క్లిక్ అయితే లాభాల పంటే. సమంత లక్కీ లెగ్ అలా వుంది మరి.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments