ఎన్టీఆర్ పంతమే నెగ్గింది

చంద్రబాబు నాయుడు చాలా మాస్టర్ ప్లాన్ వేసి, నందమూరి సుహాసినిని ఆఖరి నిమిషంలో కూకట్ పల్లి ఎన్నికల రంగంలోకి దింపారు. ఆ విధంగా నందమూరి హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేసినట్లు, వారిని తెలంగాణకు పరిమితం చేసినట్లు చేసి, తన రాజకీయ చాణక్యం ప్రదర్శించారు.

అయితే అదే సమయంలో తెలివిగా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకునే ముందు హరికృష్ణ కుటుంబ సభ్యులు అందరితో, ముఖ్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో సంప్రదించారని మీడియాలోకి వార్తల లీకులు వదిలారు. కానీ వాస్తవం వేరు.

అస్సలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను మాట మాత్రం కూడా సంప్రదించలేదు. దీంతో వాళ్లకు ఎక్కడో గిల్లినట్లు అయింది. తమ కుటుంబాన్ని ఇంకా టార్గెట్ చేస్తున్నట్లు ఫీలయ్యారు. పైగా తమను సంప్రదించకుండానే సంప్రదించినట్లు లీకులు ఇవ్వడం వాళ్లకు కాస్త ఇబ్బంది కలిగించింది.

అక్కడితో ఆగకుండా కూకట్ పల్లి ప్రచారానికి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ వస్తారని లీకులు వదిలారు. కానీ ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ప్రచారానికి వచ్చే సమస్య లేదని వారితో అనుబంధం వున్నవారు, అభిమానులు ముందే చెప్పుతూ వచ్చారు.

ఈ మేరకు గ్రేట్ ఆంధ్రకు అప్పట్లో వారు చెప్పారు. కావాలంటే ఈ విషయంలో ఎంతయినా పందెం అని కూడా సవాల్ చేసారు. అయినా కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తారనే ప్రచారం ఆగలేదు. అక్కడితో ఆగకుండా నందమూరి తారకరామ్ ను తీసుకువచ్చి, షార్ట్ కట్ లో అతగాడి పేరు కూడా ఎన్టీఆర్ అని పేర్కొంటూ ప్రచారం సాగించారు.

అయినా ఎక్కడా ఒక్కమాట బయటకు రాకుండా, జాగ్రత్తపడుతూ వచ్చారు ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్. ఆఖరికి ప్రచారం ముగిసిపోయింది. అన్నదమ్ములు రాకుండానే సుహాసిని ఎన్నికల ప్రచారఘట్టం ముగిసింది. ఈ వ్యవహారం భవిష్యత్ లో ఎక్కడకు, ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

'ఎన్టీఆర్' రారంటే.. రారు.. ఎంత పందెం చెప్పు..?

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments