ఎన్టీఆర్ కోసం ఎందరో వెయిటింగ్

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తాడా? ఎన్టీఆర్ అని ఎందరో వెయిట్ చేస్తున్నారు. టాప్ లైన్ డైరక్టర్లతో ఎన్టీఆర్ ప్రాజెక్టులు వరుసగా ప్లానింగ్ లో వుండడం విశేషం. ఒకరుకాదు ఇద్దరు కాదు, దాదాపు నలుగురైదుగురు టాప్ డైరక్టర్లు ఎన్టీఆర్ తో సినిమా ప్లానింగ్ లో వున్నారు. వీరంతా ఎన్టీఆర్ ఎప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి రీవీల్ అవుతాడా అని చూస్తున్నారు. బన్నీతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తరువాత సినిమా ఎన్టీఆర్ తోనే అని దాదాపు ఫిక్స్ అయిపోయినట్ల బోగట్టా.

విజయ్ తో బిజిల్ సినిమా పూర్తి చేసుకుని, ఈ నెలలో విడుదల చేస్తున్న డైరక్టర్ అట్లీ తో ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. అందుకే అట్లీ తను ప్రస్తుతం చేస్తున్న బిజిల్ సినిమా తరువాత మరే సినిమా ఓకె చేయలేదు. కొరటాల శివ సన్నిహితులకు ఆయన డైరక్షన్ లోనే ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా ఈ లైనప్ లోనే వుంది.

కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో చేయబోయే రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఒకటి. అంటే ఒక్క సుకుమార్ మినహా మిగిలిన టాప్ లైన్ డైరక్టర్లు అందరూ ఎన్టీఆర్ ప్రాజెక్టులను పట్టుకుని వేచివున్నారు. మరి వీళ్లలో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందో అన్నది మార్చి నాటికి కానీ తెలియదు. 

సైరా ట్రైలర్ క్రేజ్ ఏ రేంజ్ అంటే.. చూసి తీరాల్సిందే..!

Show comments

Related Stories :