ఎన్టీఆర్ డంగల్ గెటప్

రాజమౌళి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ ల.. ఆర్ ఆర్ ఆర్ సినిమా ముహూర్తం జరిగిపోయింది. 19 నుంచి షూటింగ్ కి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ముహూర్తం షాట్ కు వచ్చిన ఎన్టీఆర్ ను చూసి అందరికీ కాస్త ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే కాస్త బలంగా గుబురు గడ్డంతో కనిపించాడు. ఇదే గెటప్ సినిమాలో ఉంటుందని జనం అనుకోవడం మొదలైంది.

అయితే సినిమాలో ఎన్టీఆర్ గెటప్పు ఈ లుక్కుకి కాస్త దగ్గరగా మాత్రమే ఉంటుందట. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ మాదిరి కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో కనిపించబోతున్నాడు. అయితే గెడ్డం మాత్రం ఇంత ఉండదు.

ఇప్పుడున్న గడ్డాన్ని చాలావరకు ట్రిమ్ చేస్తారు. టోటల్గా ఎన్టీఆర్ మాత్రం బాగా కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తాడు అన్నది మాత్రం వాస్తవం. రామ్ చరణ్ మాత్రం శారీరక కొలతల మార్పులేవీ ఉండవని హెయిర్ స్టైల్ గడ్డం మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటాయనీ తెలుస్తోంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments