ఎన్టీఆర్-చరణ్ లకు నెలకో పదిలక్షలు!

ఆర్ ఆర్ ఆర్ - రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబో మహా భారీ సినిమా. ఈ సినిమా కోసం వందల కోట్లు ఖర్చుచేస్తున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలం ఈ సినిమా కోసం టాప్ హీరోలు అయిన ఎన్టీఆర్-రామ్ చరణ్ టైమ్ కేటాయించారు. మరి అలాంటపుడు వారికి ఇచ్చే రెమ్యూనిరేషన్ ఏమేరకు వుంటుంది? ఇదీ సినిమా ఫ్యాన్స్ లో వినిపించే ప్రశ్న.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు చెరో పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ గా ఇస్తున్నారని బోగట్టా. దీంతో పాటు చాలా ఎక్కువ కాలం సినిమా కోసం టైమ్ కేటాయించాల్సి వస్తున్నందున నెలకు చెరో పది లక్షల వంతున షూటింగ్ ఖర్చులకోసం కేటాయించినట్లు తెలుస్తోంది. షూటింగ్ ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు కూడా ఇద్దరు హీరోలకు చెరో పదిలక్షలు వంతున ఇస్తూ వెళ్లడానికి ముందుగానే అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అంటే రెండేళ్ల పాటు షూటింగ్ జరిగితే ఇద్దరు హీరోలకు చెరో 2.40 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయన్నమాట.

రాజమౌళి మాటేమిటి?

వందల కోట్ల ఖర్చుతో సినిమాలు రూపొందించడం, వేల కోట్ల మార్కెటింగ్ సాధించడం, లాభాలు కూడా అంతే రేంజ్ లో తెచ్చిపెట్టడం దర్శకుడు రాజమౌళికే సాధ్యం. మరి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆయన పారితోషికం మాటేమిటి? దర్శకుడు రాజమౌళికి పారితోషికం లేదు. లాభాల్లో సగం వాటా ఆయనకే అని నిర్మాత దానయ్యతో ఒప్పందం అని తెలుస్తోంది. సినిమాను ముందుగా అనుకున్న ప్యాకేజ్ ఫిగర్ కు పూర్తి చేయడం, లాభంలో సగం వాటా తీసుకోవడం అన్నది ఒప్పందంగా తెలుస్తోంది. రాజమౌళి వాటాలోనే ఆయన ఫ్యామిలీ మెంబర్లు అందిరకీ రెమ్యూనిరేషన్ లు వుంటాయని తెలుస్తోంది.

Show comments