ఉన్నది ఉన్నట్టుగా దించేసిందిగా

సినిమాల్ని కాపీకొట్టడంలో నందినీరెడ్డి దిట్ట. ఏదైనా సినిమాను రిఫరెన్స్ గా తీసుకొని ఇంకో సినిమా తీయాలంటే ఆమె తర్వాతే ఎవరైనా. గతంలో ఆమె తీసిన జబర్దస్త్ సినిమానే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. హిందీలో సూపర్ హిట్ అయిన బ్యాండ్ బాజా బారాత్ అనే సినిమాను కాపీ కొట్టి యథాతథంగా దించేసింది. దీనిపై అప్పట్లో చాలా పెద్ద వివాదమే నడిచింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశమే వచ్చింది నందినీరెడ్డికి.

సమంతను లీడ్ రోల్ లో పెట్టి ఓ బేబీ సినిమా తీస్తోంది నందినీరెడ్డి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ విడుదలయ్యాయి. గతంలో కొరియన్ లో వచ్చిన మిస్ గ్రానీ పోస్టర్లు, ఈ సినిమా పోస్టర్లు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి.

నిజానికి మిస్ గ్రానీ సినిమాకు రీమేక్ గానే ఓ బేబీ సినిమా వస్తోంది. కాబట్టి ఆ కొరియన్ సినిమాను పోలినట్టే ఓ బేబీ ఉంటుంది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. రీమేక్ చేస్తున్నారు సరే, చివరికి సినిమా పోస్టర్లు కూడా రీమేక్ నుంచే కాపీకొట్టాలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

రీమేక్ అంటే సినిమాను మక్కికిమక్కి దించేయొచ్చు. అందులో ఎవరికీ ఏ సమస్యలేదు. కానీ పోస్టర్లను కూడా కాపీకొట్టడం కాస్త ఓవర్ గానే అనిపిస్తోంది. అందుకే మిస్ గ్రానీ పోస్టర్లు, ఓ బేబీ పోస్టర్లను పక్కపక్కనపెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు.

పదేళ్ల రాజకీయ ప్రస్థానం అద్భుత మలుపు